Breaking News | 14 ఏళ్లకే అపనికి అడ్డు వస్తుంది అని తల్లిని చంపిన కూతురు..

Breaking News | రాను రాను మానవత్వం మంట గలిసిపోతున్నాయి. ప్రేమించినవాడి కోసం కట్టుకున్న భర్తను, కన్నతల్లినే కడతేరుస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో యువత పెడదోవన వెళుతూ.. కన్నవారి ప్రాణాలనే తీస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని కన్నకూతురే కిరాతంగా హ*త మార్చింది. నువ్వు చేసేది తప్పు అని మందలించినందుకు కనికరం లేకుండా.. కర్కశంగా కడతేర్చింది. తల్లితో ఉన్న బంధాన్ని మరిచి.. ప్రియుడి సహకారంతో అతి కిరాతకానికి ఒడిగట్టింది. కన్న పేగు బంధాన్ని, పెంచిన ప్రేమను మరిచి కసాయిలా మారింది ఓ కూతురు. తన సుఖానికి అడ్డు వస్తుందని ప్రాణం తీసేసింది . అసలు కధలోకి వెళ్తే మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఓ మైనర్ బాలిక 8నెలల క్రితం ఇన్ స్టాగ్రాంలో పరిచయమైన ప్రేమికుడి కోసం కని పెంచి కంటికి రెప్పలా సాకిన తల్లినే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది.

30 ఏళ్లకే కీళ్ల నొప్పులు రావడాని ముఖ్యకారణం ఏమిటి అంటే..?

జీడిమెట్లలోని ఎన్ ఎల్బీ నగర్ లో నివాసం ఉండే అంజలికి పదవ తరగతి..ఎనిమిద తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు. పెద్దకూతురు తేజశ్రీ(16)కు 8నెలల క్రితం నల్లగొండ జిల్లా కట్టంగూర్ కు చెందిన ఇంటర్ విద్యార్ధి శివ(19)తో ఇన్ స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. వారిమధ్య ప్రేమ ముదిరిపోగా వారం రోజుల క్రితం ఇంట్లో ఉన్న రూ.2లక్షల నగదుతో సహా తేజశ్రీ ప్రియుడు శివ వద్దకు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తల్లి అంజలి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తేజశ్రీ ఆచూకీ తెలుసుకుని ఆమెను తిరిగి తల్లి వద్దకు చేర్చారు. తాను శివతోనే ఉంటానని..

అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతురును ఇంత చిన్న వయసులో ప్రేమ, పెళ్లి ఎందుకంటూ తల్లి అంజలి మందలించింది. దానితో కూతురు ఆమెపై కోపం పెంచుకుంది. తల్లి తన ప్రియుడితో సంబంధానికి అడ్డుగా ఉందని భావించి, హత్యకు ప్లాన్ చేసింది. తేజశ్రీ తన ప్రియుడు శివ, అతని సోదరుడు యశ్వంత్‌ను ఇంటికి పిలిచింది. వారు అంజలిని గొంతు పిసికి, తలపై ఐరన్ రాడ్‌తో కొట్టి హత్య చేశారు. ఐదు రోజుల క్రితం తేజశ్రీ (Tejashree)తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఈ విషయంపై అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది, దీంతో తేజశ్రీ తిరిగి ఇంటికి వచ్చింది. ఈ సంఘటన తల్లి-కూతురు మధ్య గొడవలకు కారణమైంది. జీడిమెట్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తేజశ్రీ, శివ, యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..