Junior Movie

Junior Movie | జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Movie | తెలుగు తెరపైకి మరో కొత్త హీరో వచ్చాడు. తెలుగు మూలాలున్న కర్ణాటక రాజకీయ నేత గాలి జనార్దనరెడ్డి తనయుడైన కిరీటి ‘జూనియర్’ సినిమాతో ఒకేసారి అటు కన్నడలో.. ఇటు తెలుగులో హీరోగా అరంగేట్రం చేశాడు. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ప్రొడక్షన్లో రాధాకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

Junior Movie
Junior Movie

కథ:

లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ కంటే ఎగ్జైట్‌మెంట్‌తో కూడిన ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే కుర్రాడు అభి (కిరీటీ). అన్నింట్లోనూ అనుభవాలతో పాటు మెమోరీస్ వెతుక్కుంటూ ఉంటాడు. దానికి కారణం ఆయన తండ్రి కోదండపాణి (రవిచంద్రన్). ఆయనకు 50 ఏళ్లున్నపుడు అభి పుడతాడు. పుట్టిన వెంటనే అమ్మ చనిపోతుంది. దాంతో కొడుకును కంటికి రెప్పలా పెంచుతాడు కానీ జనరేషన్ గ్యాప్ కనబడుతుంది. అభికి ఏం కావాలనేది కోదండపాణికి అర్థం కాదు. తండ్రి చూపించే అమితమైన ప్రేమతో చిన్న చిన్న సరదాలు కోల్పోతున్న అభి.. హైదరాబాద్ కాలేజీలో జాయిన్ అయి అక్కడ అన్నీ తిరిగి పొందడానికి చూస్తాడు.

రాజేంద్ర ప్రసాద్ పుట్టుకకు ఎన్టీయార్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి?

ఈ క్రమంలోనే స్పూర్థి (శ్రీలీల)ను చూసి ప్రేమలో పడతాడు. చదువు అయిపోయిన తర్వాత రైస్ సొల్యూషన్స్ అనే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అయితే ఆ కంపెనీకి కాబోయే సీఈవో, కంపెనీ ఓనర్ (రావు రమేష్) కుమార్తె విజయ సౌజన్య (జెనీలియా)తో గొడవ పడి ఆమె దృష్టిలో బ్యాడ్ అవుతాడు. అప్పుడే వాళ్ల కంపెనీ విషయం కోసం విజయనగరం వెళ్లాల్సి వస్తుంది టీం. కానీ ఆ ఊరు అంటే విజయ సౌజన్యకు కోపం. అసలెందుకు ఆమెకు విజయనగరం అంటే కోపం.. అభి అక్కడికి వెళ్లి ఏం చేసాడు..? అసలు కోదండపాణి, విజయ సౌజన్యకు ఉన్న సంబంధమేంటి అనేది అసలు కథ..

Junior Movie
Junior Movie

నటీనటుల పనితీరు:

ఒక కమర్షియల్ యాక్టర్ కి కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా కిరీటిలో ఉన్నాయి. చిన్నప్పటి నుంచే హీరోకి అవసరమైన అన్ని విషయాల్లో ట్రైనింగ్ ఇవ్వడంతో.. ఎక్కడా కిరీటికి ఇది మొదటి సినిమా అనిపించదు. ముఖ్యంగా డ్యాన్సులు, ఫైట్లు విషయంలో మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాడు కిరీటి. ఓపెనింగ్ సీక్వెన్స్ లో వచ్చిన పార్కర్ ఫార్మాట్ ఫైట్ సీన్ లో మంచి ఎనర్జీ ఉంది. అలాగే.. డ్యాన్సుల్లో పునీత్ రాజ్ కుమార్ & జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు. ముఖ్యంగా వైరల్ వయ్యారి పాటలో చాలా ఈజ్ తో కిరీటి చేసిన స్టెప్పులకు థియేటర్లలో విజిల్స్ పడడం ఖాయం.శ్రీలీల ఈ సినిమా ఫస్టాఫ్ లో మాత్రమే కనిపిస్తుంది.

సెకండాఫ్ లో మాయం అయిపోయింది.జెనీలియా రీఎంట్రీ ప్రాజెక్ట్ అవ్వడంతో ఆమెను మళ్లీ చూసేందుకు జనం ఉవ్విళ్లురారు. అయితే.. ఆమె పాత్ర ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి.కన్నడ నటుడు రవిచంద్రన్ తన సీనియారిటీతో పాత్ర బరువుతో సంబంధం లేకుండా మంచి నటనతో అలరించారు. రావు రమేష్, సత్య, వైవా హర్ష తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి ఒక ప్రొపర్ కమర్షియల్ సినిమాగా “జూనియర్”ను ప్యాక్ చేశాడు. ఫైట్లు, డ్యాన్సులు, ఎమోషనల్ సీన్స్, ట్విస్టులు అన్నీ ఉన్నాయి. అయితే.. వాటి మేళవింపు మాత్రం పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది. కిరీటిని మాస్ ఆడియన్స్ కు చేరువ చేయడంలో సక్సెస్ అయ్యాడు కానీ.. సినిమాగా ఆకట్టుకునేలా చేయడంలో మాత్రం తడబడ్డాడు. దేవిశ్రీప్రసాద్ పాటలు డీసెంట్ గా ఉన్నాయి. వైరల్ వయ్యారి ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రేటింగ్- 2.5/5

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..