Kubera | తమిళంలో కుబేర డిజాస్టర్ అవడానికి కారణం ఇదే.. శేఖర్ కమ్ముల
Kubera | శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన ‘కుబేర’ మూవీ జూన్ 20న విడుదలై టాలీవుడ్‌లో పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఈ సినిమాపై ఆసక్తి కనిపించడంలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా తక్కువగానే ఉండడంతో తమిళ ప్రేక్షకుల స్పందనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధనుష్ హీరో అయినా, ఇది తెలుగు నిర్మాణం కావడంతో కావాలనే తమిళ ఆడియన్స్ పట్టించుకోవడం లేదంటూ కామెంట్లు వస్తున్నాయి. గతంలో ‘సార్’, ‘ఊపిరి’లతో ఇక్కడ హిట్ ఇచ్చినా అక్కడ పట్టించుకోలేదని తెలుగు ప్రేక్షకులు గుర్తుచేస్తున్నారు.ఇటీవలే మేకర్స్ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయినట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు.

నాగార్జున నటించిన కారణంగా తెలుగు మార్కెట్ స్థాయి మరింతగా పెరిగిందని, శేఖర్ కమ్ములపై ఉన్న నమ్మకంతో తెలుగు ప్రేక్షకులు సినిమా థియేటర్ల ముందు క్యూ కట్టారని విశ్లేషకుల అభిప్రాయం.తెలుగు ప్రేక్షకులు నాగార్జున, శేఖర్ కమ్ముల, రష్మిక మందన్న కోసం కుబేర సినిమాను చూడాలి అనుకుని ఉంటారని, అందుకే భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన విజయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
మీకు తెలుసా .. ఈ చిన్న వ్యాపారంతో నెలకు రూ.12 లక్షలు సంపాదన..!!
ఈమధ్య కాలంలో హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా అంతంత మాత్రమే వసూళ్లు రాబడుతున్నాయి. కానీ కుబేర మాత్రం డ్రై గా ఉన్న బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కుబేర’కు తమిళంలో బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. తమ తమిళ హీరో నటించిన చిత్రమే అయినప్పటకి వీకెండ్ లో ఒక మోస్తారు వసూళ్లతో సరిపెట్టుకుందీ ఈ చిత్రం. వీకెండ్ తర్వాత వసూళ్లు బాగా పడిపోయాయి. ప్రస్తుతానికి వసూళ్లు రూ.20 కోట్లకు అటు ఇటుగా ఉన్నాయి. ఫుల్ రన్లోనూ రూ.25 కోట్లకు మించి రాబట్టే అవకాశం కనిపించడం లేదు.

ఈ సినిమాకు తమిళంలో జరిగిన బిజినెస్సే తక్కువ. రూ.18 కోట్ల తక్కువ మొత్తానికి హక్కులు అమ్మారు. వసూళ్లు చూస్తుంటే 40-50 శాతం మధ్య నష్టాలు తప్పేట్లు లేవు. తమిళంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పట్ల డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందిస్తూ.. కుబేర కథ, ధనుష్ పాత్ర తమిళ సెన్సిబిలిటీస్ కు తగ్గట్లుగా ఉంటాయి. ఇలాంటి వైవిధ్యమైన కథలు, పాత్రలను అక్కడి వాళ్లు బాగా ఆదరిస్తారు. వాళ్ల అభిరుచికి తగ్గ సినిమా ఇది. అయినా ఈ సినిమాకు వసూళ్లు తక్కువ రావడం ఏంటో అర్థం కావడం లేదు. అసలిలా ఎందుకు అయిందో, ఎక్కడ తప్పు జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పుకొచ్చారు శేఖర్ కమ్ముల.










