Manchu Vishnu

Manchu Vishnu | టాప్ హీరో-హీరోయిన్ల వాట్సాప్ గ్రూప్ నుంచి మంచు విష్ణు ఔట్..? ఏం జరిగినది అంటే..

Manchu Vishnu | మోహన్ బాబు కుమారుడు అయినటువంటి మంచు విష్ణు తాజాగా కన్నప్ప అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ , మలయాళ నటుడు మోహన్ లాల్ , టాలీవుడ్ నటుడు మోహన్ బాబు , కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన ప్రపంచకవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సీడెడ్ ఏరియా థియేటర్ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తుంది.

ఈ మూవీ యొక్క సీడెడ్ ఏరియా హక్కులను టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి ఓ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు తెలుగు ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్లందరూ కలిసి పెట్టుకున్న ఒక వాట్సాప్ గ్రూప్ గురించి చెప్పుకొచ్చాడు. విష్ణు కన్నా ముందు ఈ గ్రూప్ గురించి చాలామంది హీరోలు మాట్లాడారు. ఇక హీరోలందరూ కలిసి ఇందులో చాట్ చేసుకుంటారట. ట్రైలర్స్, సాంగ్స్, జోక్స్ అన్ని షేర్ చేసుకుంటారట. తమ సినిమాల గురించి మాత్రమే కాకుండా వేరే సినిమాల గురించి కూడా మాట్లాడుకుంటారని తెలిపారు.

టాలీవుడ్ వాట్సాప్ గ్రూప్

Manchu Vishnu
Manchu Vishnu

ఇక ఈ గ్రూప్ ను అల్లు అర్జున్, రానా క్రియేట్ చేయగా.. అందులో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కుర్ర హీరోలందరూ ఉంటారట.తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ వాట్సాప్ గ్రూప్ గురించి అడగ్గా మంచు విష్ణు దీనిపై సమాధానమిచ్చారు.మంచు విష్ణు మాట్లాడుతూ.. రానా, బన్నీలు ఆ వాట్సాప్ గ్రూప్ ప్రారంభించారు. నేను కూడా ఒకప్పుడు ఆ గ్రూప్ లో ఉండేవాడిని. ఆ గ్రూప్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. దాంతో నాకు ఆ గ్రూప్ లో చాట్ చేయాలంటే చాలా సిగ్గుగా అనిపించేది. అందుకే టాలీవుడ్ వాట్సాప్ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసాను. ఏదైనా ఉంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయమని రానా, బన్నీలకు చెప్పాను. మేమంతా కలిసే పెరిగాం. ఎవరి ఏ అవసరం వచ్చినా ఒక ఫోన్ కాల్ తో కలిసిపోతాం అని తెలిపారు.

‘కుబేర’ మూవీ రివ్యూ & రేటింగ్ ..?

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..