Mirapakay | మిరపకాయ్ సినిమాలో డిఫరెంట్ వాయిస్ చేసిన ఈ నటి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా .
Mirapakay | హీరో రవితేజ సినిమాల్లో ‘మిరపకాయ్’.. ది బెస్ట్ మాస్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. 2011లో విడుదలైన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ మూవీ ఎంత పెద్ద హిట్ సాధించిందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరకంగా చెప్పాలంటే.. ఈ సినిమా అటు రవితేజ, ఇటు హరీష్ శంకర్లకు విపరీతమైన క్రేజ్ సంపాదించింది. తమన్ అందించిన అన్ని పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఒక ఎత్తయితే.. హీరోయిన్‌కి ఫ్రెండ్‌గా నటించిన అమ్మాయి మరో ఎత్తుగా నిలిచింది.

సినిమాలో కనిపించేది కాసేపే అయినా ఆమె వాయిస్, మ్యానరిజం ప్రేక్షకులకి తెగ నచ్చేశాయి. సినిమా అంతా ప్యాంట్, షర్ట్‌తోనే కనిపిస్తూ డిఫరెంట్ వాయిస్‌తో భలేగా ఇంప్రెస్ చేసింది. సినిమా వచ్చి 14 ఏళ్లయినా ప్రేక్షకులు ఈ అమ్మాయి గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆముద్దుగుమ్మ పేరే ‘స్నిగ్థ’. ఈమె మిరపకాయ్ సినిమాలో కనిపించింది చాలా తక్కువ సేపే కానీ, ఆ కొద్ది నిమిషాలైనా తన వాయిస్ తో అందర్నీ మెస్మెరైజ్ చేసింది. అంతేకాకుండా.. ఈ సినిమాలో తన మాటాలతో ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంది స్నిగ్థ.
మీకు తెలుసా .. ఈ చిన్న వ్యాపారంతో నెలకు రూ.12 లక్షలు సంపాదన..!!
కానీ, మిరపకాయ్ సినిమా తర్వాత స్నిగ్థ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు.పైగా సోషల్ మీడియాలో కూడా అమ్మడు పెద్దగా యాక్టివ్ గా లేదు. కాకపోతే.. ప్రస్తుతం దర్శకుడు హరీశ్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే మిరపకాయ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హరీశ్ శంకర్ భార్య పేరు, ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఈ బ్యూటీ పేరు స్నిగ్థ ఒకటి కావడంతో ప్రస్తుతం ఈ చిన్నదాని పేరు, ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ విషయం పై ఇటీవలే హరీశ్ శంకర్ క్లారీటి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. స్నిగ్థకు ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయంట. కానీ, ఈ బ్యూటీ పెద్దగా నటనపై ఆసక్తి లేకపోవడంతో.. మరీ ఏ సినిమాల్లో నటించలేదట. ఈ క్రమంలోనే.. పెళ్లి చేసుకొని పూర్తిగా నటనకు ఈ దేశానికి గుడ్ బై చెప్పేసింది. అయితే ప్రస్తుతం స్నిగ్థ ఒరెగాన్లోని పోర్ట్‌ల్యాండ్‌లో ఉంటుదట, ఇక అక్కడే మంచి జాబ్ చేస్తూ.. తన ప్యామిలీతో వెల్ సెటిల్డ్ అయ్యిందని సమాచారం.










