Nandamuri Balakrishna

Nandamuri Balakrishna | కారుకి ఫాన్సీ నెంబర్ కోసం బాలయ్య ఎన్ని లక్షలు చెల్లించాడు అంటే ..?

Nandamuri Balakrishna | ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తన కారు కోసం ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకున్నారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వేలంలో రూ.7.75 లక్షలు చెల్లించి టీజీ09ఎఫ్0001 నంబర్‌ను సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ త్వరలో రిజిస్టర్ చేయనున్న తన బీఎండబ్ల్యూ వాహనం కోసం ఈ నంబర్‌ను తీసుకున్నారు.ఈ ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఖైరతాబాద్ జోన్‌లో ఒక్క రోజులోనే రవాణాశాఖకు రూ.37,15,645 ఆదాయం సమకూరింది. ఇతర ఫ్యాన్సీ నంబర్లలో టీజీ09ఎఫ్0099 నంబర్‌ను కాన్కాప్ ఎలక్ట్రికల్స్ సంస్థ రూ.4,75,999కి దక్కించుకుంది.

రూ.7.75 లక్షలు పెట్టిన బాల‌కృష్ణ

టీజీ09ఎఫ్0009 నంబర్‌ను కమలాలయ హైసాఫ్ట్ సంస్థ, ఎఫ్0005 నంబర్‌ను జెట్టి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ రూ.1,49,999కి, ఎఫ్0007 నంబర్‌ను శ్రీనివాసనాయుడు రూ.1,37,779కి, ఎఫ్0019 నంబర్‌ను నేత్రావతి బలగప్ప శివలిప్ప రూ.60 వేలకు సొంతం చేసుకున్నారు. అలాగే, గత సిరీస్‌లోని టీజీ09ఈ999 నంబర్‌ను ఈకో డిజైన్ స్టూడియో రూ.99,999కి దక్కించుకుంది.దీంతో ఫ్యాన్సీ నెంబర్లకు ఎంత ఆసక్తి నెలకొందో అర్థం చేసుకోవచ్చు.అది పక్కన పెడితే తాజాగా నందమూరి బాలకృష్ణ, నటి సంయుక్త ఏలూరు నగరంలో సందడి చేశారు.

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

ఏలూరు నగరంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని నటి సంయుక్తతో కలిసి బాలకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా తన తాజా మూవీ అఖండ 2 తాండవం గురించి బాలకృష్ణ ముచ్చటించారు. మూవీ నిర్మాణం పూర్తి అయిందని, చిత్రం చాలా బాగా వచ్చిందన్నారు. ఇటీవలే టీజర్ విడుదలైందని చెప్పారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదల అవుతుందని ఆయన వెల్లడించారు.కాగా, నటుడు బాలకృష్ణ, నటి సంయుక్తను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read : అఖిల్‌ భార్య జైనబ్‌కి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా..?

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..