Nayanthara | సంచలనం నయనతార-విఘ్నేష్‌లు విడాకులు .. అసలు ఏం జరిగినది అంటే..?
Nayanthara | కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం. కొందరు సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొంతకాలం ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఆ తర్వాత మనస్పర్థలతో అనూహ్యంగా విడిపోతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. నయనతార తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంది. తన భర్తతో, పిల్లలతో దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అలాంటి నయనతార.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ (Nayanthara) స్టోరీలో ఓ సంచలన పోస్ట్ పెట్టింది.
తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు వివాహం అనేది పెద్ది తప్పు అవుతుందని, భర్త చేసే పనులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదని నయనతార తెలిపారు. పురుషులు మెచ్యూర్‌గా ఉండరని, తనని ఒంటరిగా వదిలేయాలని కోరారు. తన భర్తతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోస్టు చేసిన వెంటనే నయనతారా డిలీట్ చేశారు. ఈ పోస్ట్ స్క్రీన్ షాట్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార, విఘ్నేష్ మధ్య గొడవలు జరుగుతున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ దంపతులు కూడా విడాకులు తీసుకునే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే తాజాగా నయనతార తన భర్త పిల్లలతో కలిసి పళని స్వామి ఆలయంలో ప్రత్యక్షం అయింది. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. సాష్టాంగ నమస్కారాలు చేశారు. భార్య, భర్తలు ఇద్దరు ఎంతో క్లోజ్‌గా కనిపించడంతో వారి విడాకుల రూమర్స్‌కి చెక్ పెట్టినట్టు అయింది.ఇక నయనతార కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె చిరంజీవితో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. సంక్రాంతికి ఈ మూవీ విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు. మరోవైపు యష్ నటిస్తున్న “టాక్సిక్”లో నటిస్తున్నారు. అలాగే మన్నన్‌గట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, మూకుతి అమ్మన్ 2, పెట్రియాట్, హాయ్, రక్కాయే వంటి చిత్రాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి.










