Fish Venkat | ఫిష్ వెంకట్ కు ప్రభాస్ ఆర్థిక సాయం.. ఎన్ని లక్షలు అంటే?
Fish Venkat | తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కామెడీతో ప్రేక్షకులకి దగ్గరైన నటుడు ఫిష్ వెంకట్. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ సినిమాలో “తొడకొట్టు చిన్నా” అనే డైలాగ్‌తో గుర్తింపు పొందిన వెంకట్, ఆ తరువాత వరుసగా అనేక టాప్ హీరోల సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం ఏమంత బాగుండడం లేదు. వెంకట్ గత 9 నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు.
ఇటీవల పరిస్థితి మరింత విషమించడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.తాజాగా తండ్రికి ఆపరేషన్ చేయించాలంటే రూ.50లక్షలు కావాలంటూ ఆయన కూతురు స్రవంతి కన్నీళ్లు పెట్టుకుంది. దాతలు ఆదుకోవాలంటూ వేడుకుంది. తన తండ్రి బతకాలంటే ఒక కిడ్నీ అయినా మార్చాలని చెప్పింది.

టాలీవుడ్ హీరోలు సాయం చేయాలంటూ రిక్వెస్ట్ చేసింది.ఆమె పరిస్థితి చూసి రెబల్ స్టార్ ప్రభాస్ చలించిపోయారు. ప్రభాస్ అసిస్టెంట్ నుంచి స్రవంతికి కాల్ వెళ్లింది. ఆపరేషన్ కు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని.. కావాల్సిన డబ్బు తాము అరేంజ్ చేస్తామని ప్రభాస్ అసిస్టెంట్ చెప్పినట్టు స్రవంతి మీడియాకు తెలిపింది. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే డోనర్ కోసం వెతుకుతున్నట్టు తెలిపింది. తనది మ్యాచ్ కావట్లేదని.. తమ్ముడి గ్రూప్ మ్యాచ్ అయినా అనారోగ్య సమస్యలు ఉండటంతో అతన్ని డాక్టర్లు వద్దన్నారని వివరించింది. ఎవరైనా దాతలు ముందుకు రావాలంటూ కోరుకుంటోంది.
Fish Venkat | నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమం.. అసలు ఏం జరిగినది అంటే..?










