Hari Hara Veera Mallu Trailer |హరి హర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది.. ఇంకా రికార్డులన్నీ రప్ప…రప్ప…
Hari Hara Veera Mallu Trailer | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీర మల్లు’ ట్రైలర్ విడుదలైంది.. అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. ఇక పవన్ కల్యాణ్ వీర మల్లు అనే అప్రతిహత యోధుడిగా కనిపించడం మెయిన్ హైలెట్. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ముఘల్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచే కథనంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాబీ డియోల్ ఔరంగజేబ్‌గా భయానకమైన పాత్రలో కనిపించగా, కోహినూర్ డైమండ్ కోసం జరుగుతున్న పోరాటం నేపథ్యంగా వీర మల్లు, ఔరంగజేబ్ ల మధ్య జరిగే యుద్ధమే చిత్రానికి హైలైట్.యాక్షన్, విజువల్స్ బిగ్ స్క్రీన్ పై మరింత కిక్కిచ్చేలా ఉన్నాయి.
పవన్ కల్యాణ్ లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. అన్నీ కలిపి ఒక పవర్ఫుల్ యోధుడిగా తెరపై నిండుగా కనిపిస్తారని తెలుస్తోంది. “ఆంధి వచ్చేసింది” అనే డైలాగ్ ఒక్కటే అభిమానుల్లో గూస్బంప్స్ కలిగిస్తోంది. “అందరూ నేను రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు… మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు” అనే మరో డైలాగ్ కూడా ఆయన రాజకీయమైన ప్రస్తుత స్థితిని ప్రతిబింబించడంతో ట్రైలర్‌కు మరింత బలాన్ని తెచ్చిపెట్టింది. అలాగే పులిని వేటాడే బెబ్బులి అనే డైలాగ్ కూడా పవర్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఉంది.ట్రైలర్లో కనిపించిన యుద్ధ సన్నివేశాలు, సనాతన ధర్మంపై ప్రధాన పాత్ర పోరాటం సినిమాలోని ప్రధాన బలంగా నిలవనున్నాయి.

ట్రైలర్‌ను బట్టి చూస్తే, జ్యోతి క్రిష్ణ విజన్ పూర్తిగా గ్రాండ్ స్క్రీన్ అనుభూతిని ఇవ్వాలన్నదే.పంచమిగా నటించిన నిధి అగర్వాల్ పాత్ర కూడా ట్రైలర్లో ఆకట్టుకుంటోంది. సునీల్, భరణి లాంటి ప్రముఖ నటులు కూడా సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్లు జ్ఞాన శేఖర్ VS, మనోజ్ పరమహంసా లు కలిసిచేసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తోట తరణి వేసిన సెట్లు ముఘల్ కాలానికి తగినంత వైభవాన్ని చూపించగా, కీరవాణి సంగీతం ఎమోషన్‌కు అర్థం చెప్పే విధంగా సాగుతోంది. ప్రకాశం KL ఎడిటింగ్ కూడా ట్రైలర్‌ను కట్టిపడేస్తోంది.










