Rajendra Prasad

Rajendra Prasad | రాజేంద్ర ప్రసాద్ పుట్టుకకు ఎన్టీయార్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి?

Rajendra Prasad | తెలుగు చిత్రసీమలో తన ప్రత్యేకతను చాటుకున్న రాజేంద్రప్రసాద్, నందమూరి తారక రామారావు కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. తాను ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో జన్మించానని ఆయన గుర్తు చేసుకున్నారు.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, “నిమ్మకూరులో ఎన్టీ రామారావు గారి ఇల్లు… అది చిన్న మేడ, ఒక పెంకుటిల్లు కలిగిన ఇల్లు. మా నాన్నగారు స్కూల్ టీచర్ కావడంతో ఆ ఊరికి బదిలీ అయ్యారు. మేము ఆ పెంకుటింట్లో దాదాపు 24 సంవత్సరాలు ఉన్నాము. ఎన్టీ రామారావు గారి ఇంట్లో నాకున్న అనుబంధం విడదీయరానిది.

నేను మా అమ్మ కడుపులో ఉండగా, తెల్లవారుజామున మూడు గంటలకు గేదె అరుస్తుంటే, మా అమ్మ గడ్డి వేయడానికి వెళ్లింది. అప్పుడు పురిటి నొప్పులు రావడంతో అక్కడే పడిపోయింది. వెంకట్రావమ్మ గారు, అంటే రామారావు గారి తల్లి, ఆమె మహా తల్లి. ఆమె ముఖం కూడా రామారావు గారిలానే ఉండేది. ఆవిడ చేతుల మీదుగానే నేను జన్మించాను. ఆ విధంగా ఎన్టీ రామారావు గారి ఇంట్లో, గొడ్ల చావిడిలో నేను పుట్టడం జరిగింది” అని రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Rajendra Prasad
Rajendra Prasad

నట కిరీటిగా పేరు సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకులందరికి తన నటనతో నవ్వులు పంచాడు. ఇక ఇప్పటికి కూడా ఓ కామెడీ క్యారెక్టర్ ఉందంటే దానికి రాజేంద్రప్రసాద్ అయితేనే సరిగ్గా సరిపోతాడని దర్శక నిర్మాతలు అతన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆయన చేసిన పాత సినిమాలు అయిన ఆ ఒక్కటి అడక్కు, మాయలోడు, అప్పుల అప్పారావు లాంటి సినిమాలు ఇప్పటికీ అందరికీ ఫేవరెట్ సినిమాలుగా గుర్తుండి పోతాయి. ఆ సినిమాలు ఎప్పుడొచ్చినా కూడా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు…అలా సీనియర్ ఎన్టీయార్ బందంతో ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీ లో నటుడి గా కొనసాగుతున్నారు…

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..