Samantha | ప్లీజ్ ‘నన్ను వదిలేయండి’ ఫొటోగ్రాఫర్లపై సమంత అసహనం..!
Samantha | అందాల భామ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవ్వాలని రెడీ అవుతుంది. పాన్ ఇండియన్ హీరోయిన్స్ గా దూసుకుపోతుంటే.. తాను కూడా రేస్ కు రెడీ అంటూ సిద్దమవుతుంది సామ్. మాయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరమైన ఈ చిన్నది ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. సమంతకు తెలుగు, తమిళ్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటించింది. ఈ చిత్రంలో నటుడు విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది ఈ అమ్మడు.. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో కూడా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఫోటోలు తీయవద్దు

ఆ సినిమా తర్వాత నటి సమంత అనారోగ్య సమస్యలతో సినిమాల్లో సినిమాలకు దూరం అయ్యింది.గత సంవత్సరం 2024లో సమంత ఒక్క సినిమాలో మాత్రమే కనిపించింది. సమంత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జనాలు, అభిమానులు కూడా సమంతకు మద్దతు తెలిపారు. తాజాగా జిమ్ నుంచి బయటికొచ్చిన సమంత, వైన్ కలర్ జిమ్ వేర్‌లో ఫోన్‌లో ఉండగా, ఫోటోగ్రాఫర్లు ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. ఆమె స్పష్టంగా “ఫోటోలు తీయవద్దు” అని కోరినా, వారు వినిపించకుండా కంటిన్యూ చేశారు.దీంతో సమంత తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, కారులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. “ఆపండి” అని ఆమె చెప్పి కారులోకి వెళ్లిపోయారు.నిజానికి నిత్యం జిమ్‌కు వెళ్లి సాధనాలు చేస్తుంటుంది.
మేడమ్ గుడ్ మార్నింగ్
సమంత ఆరోగ్య రహాస్యం ఆమె ఫిట్‌నెస్. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన సమంత రోజూ జిమ్‌కు వెళ్తుంటుంది.అయితే సమంత వెళ్లే జిమ్ తెలుసుకున్న కొందరు రోజు అక్కడ పడిగాపులు కాస్తుంటారు. సమంత ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతుంటారు. అలాగా మంగళవారం ఉదయం సమంత వెళ్లగా ఆమె చుట్టూ ఫొటోగ్రాఫర్లు, వీడియోలు మూగారు.’మేడమ్.. సమంత మేడమ్ గుడ్ మార్నింగ్’ అంటూ పలకరించారు. ఆమె కొంత ఇబ్బంది పడుతూ లోపలికి వెళ్లారు. ఆ సమయంలో ‘దయచేసి ఆపండి’ అని సమంత కోప్పగించుకుని వెళ్లిపోయింది. జిమ్‌లో సాధన చేసిన అనంతరం కూడా మీడియా కంటపడడంతో అప్పుడు కూడా సమంతకు చిర్రెత్తుకొచ్చింది. ‘ఆపండి గాయ్స్’ అని అసహనం వ్యక్తం చేస్తూ సమంత కారు ఎక్కి వెళ్లిపోయింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.










