Silk Smitha

Silk Smitha | సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్‌ పండు వేలం వేస్తే ఎన్ని లక్షలో తెలుసా..

Silk Smitha | సిల్క్ స్మిత ఇప్ప‌టి త‌రం వారికి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కాని అప్ప‌ట్లో ఆమె ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసింది. మత్కెక్కించే కళ్లతో ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా త‌న‌వైపు తిప్పుకుంది. సినీ ప్రియుల ఆరాధ్య దేవతగా మారిన సిల్క్ స్మిత చాలా బో** ల్డ్‌గా ఉంటుంది. త‌న అంద‌చందాల‌తో సౌత్‌ సినిమాని దశాబ్దన్నర పాటు శాసించింది సిల్క్ స్మిత. మలయాళ మూవీ ఒట్టపట్టేవార్‌మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సిల్క్ స్మిత భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన సీతాకోక చిలుక మూవీతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. దాదాపుగా 16 ఏళ్ల పాటు నటిగా రాణించి .. 360కిపైగా సినిమాల్లో నటించి అల‌రించింది సిల్క్ స్మిత.కుటుంబ పరిస్థితి వల్ల చదువు మధ్యలోనే ఆపేసిన సిల్క్ స్మితకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు.

Silk Smitha
Silk Smitha

పెళ్లి తర్వాత భర్త, అత్తగారి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ త‌ర్వాత బ‌తుకుతెరువు కోసం నటి అపర్ణకు టచ్ అప్ ఆర్టిస్ట్ గా తన సినిమా జీవితాన్ని ప్రారంభించింది. మలయాళ దర్శకుడు ఆంటోనీ ఈస్ట్‌మన్.. సిల్క్ స్మితకి హీరోయిన్ గా అవకాశం ఇవ్వ‌డ‌మే కాకుండా ఆమెకు స్మిత అని పేరు పెట్టారు. అయితే సిల్క్ తొలుత వ్యాంపు రోల్స్ చేయడంతో వాటికి ఆడియెన్స్ క‌నెక్ట్ అయ్యారు. దాంతో ఆమెకి అవ‌కాశాలు పెరిగాయి.మేకర్స్ సిల్క్ స్మిత డేట్స్ కోసం కూడా ఎదురు చూసేవారు.

ALSO READ : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

 సగం తిన్న యాపిల్‏.. 

ఒక‌వైపు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తూనే మరోవైపు వ్యాంపు రోల్స్, ఇంకోవైపు ఐటెమ్‌ సాంగ్స్ తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపేసింది సిల్క్ స్మిత. ఆమె కళ్లకు చాలామంది అభిమానులు దాసోహం అయ్యారు. మలయాళం, తమిళ హీరోలు అయితే తమ చిత్రాల్లో సిల్క్ స్మిత పాటలు ఉండాలని కోరుకునేవారు. సిల్క్ ఒక్క ఐటమ్ డ్యాన్స్ చేయడానికి 50 వేల వరకు పారితోషికం తీసుకునేదట.అంటే ఇప్పటి కాలంలో 5 కోట్లకు సమానం అని అంటుంటారు.. అంటే ఇప్పటి లెక్క ప్రకారం చూస్తే సమంత, రష్మికలు కూడా ఆమె ముందు దిగ‌దుడుపే అని చెప్పాలి.

Silk Smitha
Silk Smitha

అదంతా పక్కన పెడితే 1984 వ సంవత్సరంలో షూట్ గ్యాప్ లో ఆమె ఆపిల్ తింటూ కూర్చుంది. ఇక షాట్ రెడీ అవడంతో తను సగం తిన్న ఆపిల్ ని టేబుల్ మీద పెట్టి షూట్ కోసం వెళ్ళిపోయింది. ఇక అక్కడే ఉన్న సిల్క్ స్మిత మేకప్ మెన్ ఆ ఆపిల్ ని వేలం వేశాడు.లొకేషన్ లో ఉన్న వాళ్లే దాన్ని 26 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇక మొత్తానికైతే అప్పట్లో ఇదొక ట్రెండ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఆమె స్టార్ డమ్ ముందు స్టార్ హీరోలు సైతం కొద్ది రోజులపాటు నిలబడలేకపోయారు అనేది మాత్రం వాస్తవం. అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న సిల్క్ స్మిత 1996వ సంవత్సరంలో మరణించడం అనేది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి తీరని లోటు అనే చెప్పాలి…

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..