Surekha Vani | అక్కడ పచ్చబొట్టు వేసుకున్న సురేఖా వాణి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్

Surekha Vani | విజయవాడలో పుట్టి పెరిగిన సురేఖవాణి 8వ తరగతి చదువుతున్నప్పుడు ఓ లోకల్ ఛానెల్‌లో యాంకర్‌గా చేసింది. అలానే ఇంటర్ వరకు నెట్టుకొచ్చిన ఆమె.. యాంకరింగ్‌లోనే స్థిరపడాలని నిర్ణయించుకుంది.ఈ క్ర‌మంలోనే మీడియా రంగానికి చెందిన సురేష్ తేజ‌ని వివాహం చేసుకుంది. వృత్తిరీత్యా వారిద్ద‌రి మ‌ధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు సుప్రీత సంతానం. అయితే ఈ మ‌ధ్య సురేష్ తేజ అనారోగ్యంతో చ‌నిపోయారు.అదంతా కాసేపు పక్కన పెడితే ప్పటికే మూడు సినిమాల్లో నటిస్తోంది సుప్రిత. అందులో ఒకటి లేచింది మహిళా లోకం. అలాగే బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ తో కలిసి మరో మూవీలో యాక్ట్ చేస్తోంది.

ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నాయి. వీటితో పాటు అమ‌రావ‌తికి ఆహ్వానం పేరుతో తెర‌కెక్కుతోన్నమరో హారర్ థ్రిల్లర్ మూవీలోనూ హీరోయిన్ గా కనిపించనుంది సుప్రిత. ‌ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది సురేఖా వాణి. తన కూతురు సుప్రీతా తో కలిసి డ్యాన్స్ రీల్స్ చేస్తూ తన ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది సురేఖా వాణి. ఇందులో ఈమె టాటూ వేయించుకుంటూ కనిపించింది. అలాగే కూతురు సుప్రిత కూడా చప్పట్లు కొడుతూ దర్శనమిచ్చింది. ఈ వీడియోను షేర్ చేస్తూ.. “ఆ పెదబాబు అడుగుల వెనకే ఉన్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.సురేఖా వాణీ తనకనెంతో ఇష్టమైన ఏడు కొండల స్వామి పాదుకలను కుడి చేతిపై పచ్చబొట్టుగా వేయించుకున్నారు.

Surekha Vani
Surekha Vani

అలాగే గోవిందా నామాలను కూడా వేయించుకున్నారు. స్వామివారిపై ఉన్న భక్తితో ఆమె ఈ విధంగా చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను సురేఖ వాణి ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.ముందు నా పెదబాబు నడుస్తాడు ఆయన వెనుక నేను నడుస్తాను గోవిందా గోవిందా అంటూ సురేఖ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇది చూసిన కొందరు ఆమె భక్తిని ప్రశంసిస్తుండగా మరి కొందరు మాత్రం ఆమె ఓవరాక్షన్ చేస్తోందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే స్వామివారు అంటే నమ్మకం ఉండటం వల్లే ఆమె టాటూ వేయించుకున్నారని సమాచారం అందుతోంది. గతంలో సురేఖా వాణి తిరుమలలో తలనీలాలు సమర్పించిన సంగతి తెలిసిందే.ఇక సురేఖా వాణి చాలా రోజుల త‌ర్వాత క‌న్నప్ప చిత్రంలో న‌టించింది. ఈ చిత్రం జూన్ 27న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీతో త‌న ఫ్యాన్స్‌ని అల‌రించ‌నుంది.

also read : వచ్చే వారం నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు.. ఎక్కడెక్కడ అంటే ?

Leave a Comment