Bike tax | టూ వీలర్లకూ టోల్ ఫీజు.. మంత్రి షాకింగ్ కామెంట్స్ ,
Bike tax | ఇటీవలే గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం ఇప్పుడు మరో బాదుడుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు కార్లు, బస్సులు, లారీల వంటి భారీ వాహనాలకే పరిమితమైన టోల్ ఛార్జీలు.. ఇకపై ద్విచక్ర వాహనాలకూ ( Two wheelers) వర్తించబోతోన్నాయి. దీనికి సంబంధించిన కసరత్తును కేంద్రం ఇప్పటికే పూర్తి చేసినట్లు చెబుతున్నారు. టూ వీలర్లపైనా టోల్ ఛార్జీలను వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.ఈ విధానం జులై 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది.తాజాగా ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వార్తలపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.
ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన గురువారం స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాల నుంచి టోల్ రుసుము వసూలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన తేల్చిచెప్పారు.”ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. ప్రస్తుతం ఉన్న విధంగానే వాటికి టోల్ పన్ను నుంచి పూర్తి మినహాయింపు కొనసాగుతుంది” అని పేర్కొన్నారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా కొన్ని మీడియా సంస్థలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తలను ప్రసారం చేయడం సరికాదని అన్నారు.

ఇలాంటి నిరాధారమైన వార్తల వల్ల ప్రజల్లో అనవసర ఆందోళన నెలకొంటుందని తెలిపారు.కేంద్ర మంత్రి ప్రకటనకు అనుగుణంగానే, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కూడా ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేసింది. ద్విచక్ర వాహనాలకు టోల్ రుసుము విధించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. కాబట్టి, జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనదారులు ఎలాంటి టోల్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న నిబంధనలే కొనసాగుతాయని స్పష్టమవుతోంది.
వారెవ్వా..!! డాడీ సినిమాలోని ఆ చిన్న పాపని చూస్తే ఫిదా అవ్వాల్సిందే.










