Vaishnavi Chaitanya

Vaishnavi Chaitanya | వైష్ణవి చైతన్య తొలి పారితోషికం ఎంతో తెలుసా

Vaishnavi Chaitanya | తెలుగు అమ్మాయిలని టాలీవుడ్లో ఎదగనివ్వరు, వాళ్లకి హీరోయిన్ ఛాన్సులు రావు అంటూ చాలామంది గతంలో స్టేట్మెంట్లు ఇచ్చారు. దీంతో ఇది నిజమే అని ఆడియన్స్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు. కానీ అడపాదడపా కొంతమంది తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా అవకాశాలు పొందుతున్నారు. కానీ నిలబడలేకపోతున్నారు, రాణించలేకపోతున్నారు అనేది కూడా ఎప్పటి నుండో ఉన్న టాకే. అయితే మొత్తానికి ఒక తెలుగమ్మాయి కోటి పారితోషికం అందుకునే రేంజ్ కి వెళ్లడం విశేషంగా చెప్పుకోవాలి.ఆమె మరెవరో కాదు వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈమె.. తర్వాత ‘అల వైకుంఠపురములో’ ‘వరుడు కావలెను’ వంటి చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశాలు పొందింది.

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

తర్వాత ఈమె ‘బేబీ’ అనే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో వైష్ణవికి (Vaishnavi Chaitanya) కుర్ర కారు అంతా ఫిదా అయిపోయారు. ఆ సినిమా దాదాపు వంద కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది.వైష్ణవి చైతన్య గురించి వెండితెరపై సినిమాలు చూసేవారికి పెద్దగా పరిచయం లేదు కానీ.. టిక్‌ టాక్‌ వీడియోలు, యూట్యూబ్‌ షార్ట్‌ ఫిలింస్‌ చూసే వారికి ఈమె సుపరిచితురాలే. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వెబ్‌ సిరీస్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అల వైకుంఠపురం, టక్‌ జగదీష్, వరుడు కావలెను వంటి పలు సినిమాల్లో ఈ అమ్మడు కీలకపాత్రలు చేసింది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈమె తన తొలి సంపాదన గురించి అభిమానులతో పంచుకుని అందరిని షాక్‌కు గురిచేసింది.తాజాగా ఓ ఇంటర్వూలో వైష్ణవి తన తొలి పారితోషికం రూ.700 అని చెప్పింది. ఒక ఈవెంట్ కోసం డ్యాన్స్ చేసే అవకాశం రాగా.. రోజంతా చాలా కష్టపడి డ్యాన్స్ చేస్తే ఏడొందల రూపాయలు ఇచ్చారని వైష్ణవి చెప్పింది. కానీ ఇప్పుడు ఎంత సంపాదించినా ఆ ఏడొందలే తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీకు అవకాశాలు క్యూ కడతున్నాయని సమాచారం. బేబి సినిమాలో ఆమె పర్‌ఫార్మెన్స్‌ చూసి చాలా మంది దర్శక, నిర్మాతలు అమెను అప్రోచ్‌ అవుతున్నారని ఇన్‌సైడ్‌ టాక్‌.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..