Husband Kidney

Husband Kidney | రూ.10 లక్షలకి భర్త కిడ్నిని అమ్మేసి లవర్ తో భార్య జంప్…

Husband Kidney | అన్ని కుటుంబాలు మాదిరిగానే వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వాటి నుంచి బయట పడాలంటే కిడ్నీని విక్రయించాలని భర్తకు చెప్పి చూసింది. వచ్చిన సొమ్మును బ్యాంకులో వేసుకుంటే కుమార్తె చదువులు, పెళ్లికి సమస్యలు ఉండవని నచ్చజెప్పింది. చివరికి ప్రియుడితో పరారైనది. అసలు కధలోకి వెళ్తే స్ట్ బెంగాల్‌లోని హౌరాకు చెందిన ఓ మహిళ భర్తకు మాయమాటలు చెప్పి కిడ్నీ అమ్మించింది. ఆర్థిక పరిస్థితిని మెగురుపరిచేందుకు, తమ 12 ఏళ్ల కుమార్తెను మెరుగైన పాఠశాలలో చేర్పించేందుకు అతని కిడ్నీని విక్రయించాలని భర్తను ఒప్పించింది.

Husband Kidney
Husband Kidney

భర్త కిడ్నీ అమ్మేస్తే ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని అతడిని మోటివేట్ చేసింది. భార్య మాటలు నమ్మి కిడ్నీ కొనుగోలుదారుల కోసం ఏడాది కాలం వెతకగా మూడు నెలల క్రితం బయ్యర్లు దొరికారు. కిడ్నీ అమ్మేశాక, రూ.10 లక్షల డబ్బులు చేతికి వచ్చాక భార్య అసలు ప్లాన్ బయటపడింది. రూ.10 లక్షలు తీసుకుని ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ వ్యక్తితో పరారైంది. ఖంగుతిన్న భర్త అనివార్యంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

Also Read : మూడు రోజుల ఆడ శిశువును చెత్త బుట్టలో పడేసిన తల్లిదండ్రులు..?

తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు, 12 ఏళ్ల కుమార్తెను మెరుగైన పాఠశాలలో చేర్పించేందుకు అతడి కిడ్నీ అమ్మాలని ఏడాది కాలంగా భర్తపై మహిళ ఒత్తిడి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు అంగీకరించి గత నెలలో శస్త్రచికిత్స అనంతరం రూ.10 లక్షలు ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు అతని భార్య విశ్రాంతి తీసుకొని కోలుకోవాలని సూచించింది. ఆ తర్వాత ఒకరోజు ఆమె ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. అల్మరా నుండి 10 లక్షల రూపాయల నగదుతో పాటు మరికొంత మొత్తం కనిపించకుండా పోయిందని గుర్తించినట్లు బాధితుడు కంప్లయింట్‌లో తెలిపాడు.

Husband Kidney
Husband Kidney

ఇక స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయంతో ఆమెను కోల్‌కతాలో గుర్తించారు. సంవత్సరం క్రితం ఫేస్ బుక్‌లో పరిచయమైన వ్యక్తితో సదరు మహిళ నివసిస్తోందని ఐడెంటిఫై చేశారు. కుటుంబసభ్యులు ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించగా వారితో మాట్లాడటానికి ఆమె నిరాకరించింది. అత్తమామలు తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ, భర్తతో విడాకుల కోసం దరఖాస్తు చేస్తానని ప్రియుడితో చెప్పించింది. అయితే అల్మరా నుంచి కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బులును తీసుకురాలేదని, ఆమె తన సేవింగ్స్ డబ్బులను మాత్రమే తీసుకువచ్చిందని ప్రియుడు చెప్పడం గమనార్హం. దీంతో తనకు, పిల్లలకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..