YS Jagan Palnadu

YS Jagan Palnadu | టెన్షన్.. వైఎస్ జగన్‌ కాన్వాయ్ ఢీ ఒకరు మృతి.

YS Jagan Palnadu | దాదాపు 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు రెంటపాళ్ల, నందిగామ అడ్డరోడ్డు, సత్తెనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు.రెంటపాళ్లలో వైసీపీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. మరోపక్క జగన్ పర్యటనకు ఆయన కాన్వాయ్ తో పాటు మూడు వాహనాలు, వంద మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. జగన్ పర్యటన విజయవంతానికి వైసీపీ పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తుండటంతో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అనుమతికి మించి వైసీపీ శ్రేణులు పాల్గొంటే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.

కాన్వాయ్ ఢీ

కాగా, మరోవైపు నందిగామ అడ్డరోడ్డు వద్ద గోబ్యాక్ జగన్, అమరావతి ద్రోహి జగన్ అంటూ మంగళవారం రాత్రి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. వీటిని బుధవారం తెల్లవారేసరికి పోలీసులు తొలగించారు.సత్తెనపల్లిలో పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై సైరన్లతో బైక్‌లపై హడావుడి చేసిన నేతలు, బస్టాండ్ నుంచి ఐదు లాంతర్ల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. జగన్ రాకను స్వాగతించేందుకు నేతలు ఉత్సాహంగా ఏర్పాట్లు చేశారు.

YS Jagan Palnadu
YS Jagan Palnadu

ఈ బైక్ ర్యాలీ కారణంగా సత్తెనపల్లి పట్టణంలో రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. సామాన్య పౌరులు, వాహనదారులు ఈ హడావుడితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సైరన్ల శబ్దం, ర్యాలీలతో రోడ్లపై రద్దీ పెరిగి, కొంతమంది అసౌకర్యానికి గురయ్యారు.అది పక్కన పెడితే వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఏటూకురులో వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్.. ఒక వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

ప్లీజ్ ‘నన్ను వదిలేయండి’ ఫొటోగ్రాఫర్లపై సమంత అసహనం..!

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..