Sobhita dhulipala | అక్కినేని కొత్త కోడలు మరో సంచలన నిర్ణయం.
Sobhita dhulipala | తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి వస్తున్నారు. కాని అందులో కొందరు మాత్రమే తమ టాలెంట్‌తో నిలబడుతున్నారు. వారిలో తెనాలి అమ్మాయి శోభిత ధూళిపాళ్ల కూడా ఒకరు. ఆరంభంలోనే అందాలతో మాయ చేసిన ఈ చిన్నది.. దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు అందిపుచ్చుకుంది. టీనేజ్లోనే మోడలింగ్ రంగంలోకి వెళ్లిన శోభిత 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని తృటిలో కిరీటాన్ని చేజార్చుకుంది. ఇక అదే ఏడాది మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది. దాంతో శోభితకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.

రెండో పెళ్లి
ఆ తరువాత బాలీవుడ్ సినిమాలతో మొదలైన తన ప్రయాణం అనంతరం తెలుగు హాలీవుడ్ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న శోభిత గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ నటుడు అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చిన అనంతరం నటి శోభితను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత శోభిత కేవలం ఇంటికి మాత్రమే పరిమితమైన ఇంకా ఎలాంటి ప్రాజెక్టులను కూడా ఈమె ప్రకటించలేదు.
విష్ణుప్రియ కన్నీటి కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే .
ముక్కున వేలు
ఇలా వీరి పెళ్లి జరిగి మూడు నెలలు అవుతుంది అయితే తాజాగా సినిమాల విషయంలో శోభిత ఎవరు ఊహించని నిర్ణయం తీసుకొని అందరికీ గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. శోభిత పెళ్లికి ముందు ఫోటోలను కనుక చూస్తే మనం పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ బో** ల్డ్ ఫోటోషూట్స్ చేశారు. ఈ ఫోటోలలో ఈమెను చూసిన వారందరూ కూడా ముక్కున వేలు వేసుకుంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత కూడా ఈమె ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. సినిమాలే తన ఫ్యాషన్ గా ఉన్న శోభిత పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే సినిమాలలో నటించిన ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో నటించకుండా అలాగే గ్లామర్ షో చేయకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. ఇలా సినిమాల విషయంలో శోభిత తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.










