Arya Heroine | ఆర్య హీరోయిన్ అను లేటెస్ట్ పిక్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్..
Arya Heroine | టాలీవుడ్ అడియన్స్ మనసులలో నిలిచిపోయిన అందమైన ప్రేమకథలలో ఆర్య ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. స్టోరీ కొత్తగా ఉండడం, పాటలు మరింత అద్భుతంగా ఉండడంతో ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఈ సినిమా వస్తుందంటే ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు అడియన్స్. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం, పాటలు ఇప్పటికీ శ్రోతల హృదయాలను హత్తుకుంటాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు.
నవ్విస్తూనే ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాడు. ఫీల్ మై లవ్ అంటూ బిగ్ స్క్రీన్ పై మాయ చేశాడు. సుకుమార్, బన్నీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది.ఇదిలా ఉంటే.. ఈ మూవీలో బన్నీ సరసన హీరోయిన్ అను మెహతా నటించింది. అందం, అమాయకత్వం, అంతకు మించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల మనసులను దోచేసింది. కానీ ఆ తర్వాత తెలుగులో స్టార్ డమ్ అందుకోలేకపోయింది.

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కొన్ని సినిమాల్లో నటించి నటనకు దూరమయ్యింది అను మెహతా. తెలుగులో ఆర్య తర్వాత నువ్వంటే నాకిష్టం, వేడుక, మహారాజశ్రీ వంటి చిత్రాల్లో నటించిన అనుకు.. ఆర్య తప్ప మరో ప్రాజెక్ట్ విజయాన్ని అందించలేదు.ఆ మధ్యకాలంలో చెన్నై(Chennai)లోని ఓ రిసార్ట్ లో ఫ్రెండ్స్ తో కలిసి మద్యం తాగి రచ్చ రచ్చ చేసి వార్తల్లో నిలిచింది. అయితే అనూ కి ప్రస్తుతం పెళ్ళైందా..ఆమె ఏం చేస్తుంది అనే విషయాలు కూడా ఎవరికి తెలియదు.
ఆషాడమాసంలో అత్తా,కోడలు ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదో తెలుసా.
కానీ తాజాగా అనూ మెహతాకి సంబంధించి ఒక సంచలన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ ఫోటోలో అల్లు అర్జున్ ఆర్య మూవీలో అను ఎంతో చక్కగా అందంగా ఉంది. 2004లో అలా ఉన్న అను మెహతా 2025లో ఇలా అయిపోయింది అంటూ ఓ ఫోటో పోస్ట్ చేశారు ఒక నెటిజన్. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతో ఇది చూసిన చాలా మంది నెటిజెన్లు ఇదేంటి అను మెహతా ఇలా మారిపోయింది. అసలు ఈమె అనూ నేనా.. గుర్తుపట్టలేనంతగా ఉందే అంటూ ఆశ్చర్యపోతున్నారు.










