Buy Home

Buy Home | పాత ఇల్లు కొంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోక నష్టపోతారు!

Buy Home | పండుగలు అందరూ జరుపుకుంటారు. కానీ, గృహప్రవేశం అనే పండుగను మాత్రం కొందరే జరుపుకుంటారు. ఇల్లు కొనడం అనే కలను నిజం చేసుకోవడానికి సాధారణ ప్రజలు రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తారు. ప్రతి పైసాను సంవత్సరాల తరబడి దాస్తూ వెళతారు. కోరుకున్న మొత్తం పోగయ్యాక, సొంతింటి కలను సాకారం చేసుకుంటారు. అయితే.. కొత్త ఇల్లు కొనాలా, లేదా పాతది కొంటే సరిపోతుందా అనే గందరగోళాన్ని ప్రజలు తరచుగా ఎదుర్కొంటారు. రెండింటికీ దేని ప్రయోజనాలు, అప్రయోజనాలు దానికున్నాయి.సాధారణంగా, పాత ఇంటిని కొనుగోలు చేయడం లాభదాయకమైన ఒప్పందంగా మారుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

Buy Home
Buy Home

పార్కింగ్ స్థలం

అయితే, పాత ఇల్లు కొనేటపుడు ఆ ఆస్తి వయస్సు (ప్రాపర్టీ ఏజ్) నిర్ధరించుకోవాలని నిపుణులందరూ సూచనలిస్తారు.అలాగే ఇంటి పన్నులు, ఇంటిపై ఉన్న లోన్లను క్లియర్ చేశారో లేదో చెక్ చేయాలి. విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవడంతో పాటు అవసరం అనుకుంటే ఇంటికి మరమ్మత్తులు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇంటి ధర మీ బడ్జెట్‌కు సరిపోయేలా చూసుకోవడంతో పాటు మరమ్మతులు, ఇతర ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.

ఆషాడమాసంలో అత్తా,కోడలు ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదో తెలుసా.

ఇంటిని కొనే ముందు, చట్టపరమైన సలహా తీసుకోవడం ద్వారా మోసపోయే అవకాశాలు ఉండవు. మీ అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా ఇతర విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోని ఇంటిని కొనుగోలు చేస్తే మంచిది.ఇల్లు కొనుగోలు సమయంలో వాస్తును సైతం పరిశీలించాలి. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో ఇల్లు కొనుగోలు చేస్తే ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. ఇంటి దగ్గర పార్కింగ్ స్థలం ఉందో లేదో చెక్ చేయడంతో పాటు భవిష్యత్తులో రీ సేల్ వాల్యూ ఉంటుందో లేదో గమనించాలి. ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయో లేదో చెక్ చేయడంతో పాటు బిల్డర్ క్రెడిబిలిటీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

Buy Home
Buy Home

బడ్జెట్ ఆధారంగా ఇల్లు

అలాగే సొంతింటి కల సాకారం చేసుకునే దశలో బడ్జెట్ చాలా కీలకం. ఇంటి అవసరాలు ఉన్నా, బడ్జెట్ అందుకు సహకరించకపోవచ్చు. ఇల్లు పెద్ద ఆస్తి కావడంతోపాటు భారీ ఖర్చుతో కూడుకున్నది. కనుక ఇల్లు కొనుగోలు బడ్జెట్ విషయంలో ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు పనిచేసే ప్రదేశానికి కాస్త దూరమైనా మీ బడ్జె్ట్ పరిమితిలో మంచి ఇల్లు చూసుకోవాలి. ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు దుబారా ఖర్చులకు కోత విధించాలి. ఇంటి కొనుగోలుకు బడ్జెట్ ముందే ఖరారు చేసుకోవడంతోపాటు దానికి కట్టుబడి ఉంటే.. మీకు ఆస్తిగా ఇల్లు మిగులుతుంది.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..