కర్నూలు జిల్లాలో భారీ మోసం ..అధిక వడ్డీ ఆశ చూపి ఘరానా మోసం
కర్నూలు జిల్లాలో భారీ మోసం ..అధిక వడ్డీ ఆశ చూపి ఘరానా మోసం

కర్నూలు జిల్లాలో భారీ మోసం అధిక వడ్డీ ఆశ చూపి ఘరానా మోసం.శ్రేయ ఇన్‌ఫ్రా మార్కెటింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ అధిక వడ్డీ ఆఫర్లతో ప్రజల నుండి రూ.270 కోట్ల డిపాజిట్లు సేకరించి ఘరానా మోసం చేసింది. కర్నూలులో రూ.70 కోట్లు సేకరించి, చెల్లింపులు ఆపేసింది, బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధిక వడ్డీ ఆశ చూపి ఓ సంస్థ ఘారానా మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా రూ.270 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరిస్తే.. కర్నూలు జిల్లా నుంచే రూ.60-70 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కంపెనీ అకౌంట్ బ్లాక్ చేశారంటూ ఆ సంస్థ చేతులెత్తేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. డిపాజిట్లు సేకరించి మోసం చేశారంటూ శ్రేయ ఇన్‌ఫ్రా మార్కెటింగ్ ప్రైవేట్‌లిమిటెడ్ కంపెనీపై ఓ వ్యక్తి ఫిర్యాదుతో కర్నూలు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రేయ ఇన్‌ఫ్రాపై కేసు.. సీఐడీకి బదిలీ.
కర్నూలుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి గత ఏడాది నవంబరు 22న సంస్థ చైర్మన్‌తో పాటు పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును సీఐడీకి బదిలీ చేశామని త్రీటౌన్ సీఐ శేషయ్య తెలిపారు. ఏడాదిగా చెల్లింపులు ఆగిన మాట నిజమేనని, డిపాజిట్ మాత్రమే చెల్లించేలా ఖాతాదారుల నుంచి ఎన్‌వోసీలు తీసుకొని హెడ్ ఆఫీసుకు పంపిస్తున్నామని, వచ్చే నెల మొదటి వారంలో చెల్లింపులు మొదలయ్యే అవకాశముందని కంపెనీ సీనియర్ లీడర్ మహేశ్ తెలిపారు.
What's Your Reaction?






