కేంద్ర నిధులతో గుడివాడ ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం:ఎంపీ వల్లభనేని బాలశౌరి
కేంద్ర నిధులతో గుడివాడ ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం:ఎంపీ వల్లభనేని బాలశౌరి

కేంద్ర నిధులతో గుడివాడ ప్రజల సమస్యల పరిష్కరిస్తా:ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎన్టీఆర్ తర్వాత గుడివాడ అభివృద్ధికి బాలశౌరి ఎంతో కృషి చేస్తున్నారు:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ టిడిపి కార్యాలయం (ప్రజా వేదిక)లో కూటమి నాయకుల ప్రెస్ మీట్. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను. గుడివాడ సమస్యలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నా దృష్టికి తీసుకువస్తున్నారు. గుడివాడలో మూడు ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టాం. గుడివాడ మెయిన్ రోడ్, బైపాస్ రోడ్ల అభివృద్ధి. రైల్వే అండర్ పాస్ ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో కేంద్ర నిధులతో గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
18 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజ్ వరకు మెయిన్ రోడ్డు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. సెంట్రల్ లైటింగ్, డివైడర్లతో నిర్మించే ఈ రహదారి అభివృద్ధికి అవసరమైతే మరో ఐదు కోట్లు కూడా తీసుకొస్తాను. దుమ్ము ధూళీ లేకుండా స్వచ్ఛమైన గుడివాడ రూపకల్పనకు కృషి చేస్తాను. గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి కృషి. గుడివాడ నియోజకవర్గంలో ఏడాదికి రెండు చొప్పున సిఎస్ఆర్ నిధులతో కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తాం.
గుడివాడ - కంకిపాడు రోడ్డు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కృషి చేస్తున్నా. గుడివాడ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో మమేకమై ప్రజల సమస్యల పరిష్కరిస్తాను. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కామెంట్స్ అన్న ఎన్టీఆర్ తర్వాత గుడివాడ అభివృద్ధికి ఎంపీ బాలశౌరి చేస్తున్న కృషి ఎనలేనిది. కేంద్ర ప్రభుత్వ నిధులతో మెయిన్ రోడ్ అభివృద్ధి దుమ్ములేని గుడివాడ రోడ్లను త్వరలో చూడబోతున్నాం.
గుడివాడ అభివృద్ధి నిధుల కోసం ఎంపీతో కలిసి మూడుసార్లు ఢిల్లీ వెళ్లాను. ముందుగా ఎండ్ టూ ఎండ్ వరకు మెయిన్ రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతాయి. బైపాస్ రోడ్డు ఇతర సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నాం. గుడివాడ అభివృద్ధికి వ్యక్తిగత శ్రద్ధతో కృషి చేస్తున్న.... సోదరుడు ఎంపీ బాలసౌరీకి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్న. మీడియా సమావేశంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర రావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్ పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
What's Your Reaction?






