ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిబంధనలకు విరుద్ధం ..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక నిబంధనలకు విరుద్ధం ..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం

ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి సుమారు 3500 వరకు మంజూరి అయినవి ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంతకు ముందు ప్రభుత్వం నుండి లబ్దిపొందిన వారు కాకుండా, ఇల్లు లేని వారికి,స్వంత ప్లాటు ఉండి ఇల్లు కట్టే స్థోమత లేని వారికి,దివ్యాoగులకు,ఒంటరిమహిళలకు,వితంతువులకు,
అనాదలకు,పాకిపని వారికి, మొదటి ప్రాధాన్యత ఇచ్చి గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది కానీ ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జరిగిన తీరును పరిశీలిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు ఉన్న వారికి,ఇంతకు ముందు లబ్దిపొందిన వారికి కేటాయించినట్లు తెలుస్తున్నది. ఈ ఇండ్లకు ప్రభుత్వం ఇచ్చేది కేవలం 5 లక్షలు మాత్రమే దానికి అధికారులు వారు ఇచ్చిన ప్లాను ప్రకారం కట్టాలని నిర్బంధం చేస్తున్నారు వారు ఇచ్చిన ప్లాను ప్రకారం కట్టితే 2రేట్లు అధిక వ్యయం అయ్యే అవకాశం ఉంది.
మిగతా డబ్బులు వారు ఎక్కడి నుండి తేవాలి వారు ముందే బీదవారు ఇల్లు కట్టలేని పస్థితిలో ఉన్నప్పుడు ఈ అధిక వ్యయం ఎక్కడినుండి తేవాలి అదనపు భారం కొరకు తప్పని సరి అప్పులు చేయాల్సిన పరిస్థితి అంటే ఇండ్లు పొందిన వారు అప్పుల పాలు కావల్సిందేన కాబట్టి ప్రభుత్వం,అధికారులు కేవలం నాయకులు చెప్పిన వారికి కాకుండా నిబంధనల ప్రకారం అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలని,మరియు ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు సరిపడే విధంగా ఇంటి ప్లాన్ కుదించాలని,ఆపై ఇల్లు కట్టు కుంటే లబ్ధిదారుల ఇష్టానికి వదలాలని డిమాండ్.ఈ కార్యక్రమంలో నాయకులు జి.నర్శింలు,యస్.గోపాల్,పాల్గొన్నారు.
What's Your Reaction?






