ఆఫీస్ ముగిశాక రాసలీలలు.. సెక్యూరిటీ ఫిర్యాదుతో వెలుగులోకి ఉద్యోగి బాగోతం
ఆఫీస్ ముగిశాక రాసలీలలు.. సెక్యూరిటీ ఫిర్యాదుతో వెలుగులోకి ఉద్యోగి బాగోతం

అది టూరిజం డివిజనల్ ఆఫీసు. సమయానుసారం ఉద్యోగులు విధులు నిర్వహించారు. డ్యూటీ టైమ్ అయిపోవడంతో ఇళ్లకు వెళ్లిపోయారు.
కానీ ఓ కీలక ఉద్యోగి మాత్రం కార్యాలయానికి వెళ్లారు. ఒంటరిగా కాదు ఓ మహిళతో ఎంట్రీ ఇచ్చారు. దర్జాగా సొంతిళ్లు మాదిరిగా కార్యాలయం తాళం తీశారు. లోపలికి వెళ్లారు. చాలా సమయం తర్వాత బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ వ్యవహారం సదరు డిపార్టుమెంట్‌లో కలకలం రేపింది. డ్యూటీ సమయం అయిపోయిన తర్వాత మళ్లీ రావడం, అదీ మహిళను వెంటతీసుకెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన విజయవాడ టూరిజం డివిజనల్ కార్యాలయంలో జరిగింది. విజయవాడ టూరిజం డివిజనల్ ఆఫీస్(Vijayawada Tourism Divisional Office)లో పని చేసే ఉద్యోగి నిర్వాకం చర్చగా మారింది. కార్యాలయం మూసివేశాక మహిళతో ఉద్యోగి(Employee) మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. కొంత సమయం తర్వాత వెళ్లిపోయారు. స్థానిక సీసీ టీవీ ఫుటేజులోనూ దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఉన్నతాధికారులకు సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు చేశారు.
ఈమేరకు సదరు ఉద్యోగి బాగోతం వెలుగులోకి వచ్చింది. పై అధికారులకు తెలియకుండా టూరిజం కార్యాలయం తాళాలు తీయడం, మహిళతో కలిసి లోపలికి వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే సదరు ఉద్యోగి చేసిన పని ఇప్పుడు ఆ శాఖలోనే కలకలం రేపింది. సదరు ఉద్యోగి ఒక్కరేనా ఇంకా చాలా మంది ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు టూరిజం డివిజన్ కార్యాలయంలో కార్యకలాపాలు ముగిశాక అసలు ఏం జరుగుతుందనే చర్చ విస్తృతంగా వినిపిస్తోంది. విచారణ అనంతరం సదరు ఉద్యోగిని క్షమించి వదిలేస్తారో.. చర్యలు తీసుకుంటారో చూడాలి.
What's Your Reaction?






