ఏపీలో భారీ వర్షాలు... ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్..!
ఏపీలో భారీ వర్షాలు... ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్..!

ఏపీ ప్రజలను భయపెడుతున్న భారీ వర్షాలు. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు.
ఏపీలో విచిత్రమైన వాతావరణం, మండుటెండలో భారీ వానలు, పిడుగులు ఏపీ ప్రజలను భయపెడుతున్నాయి. పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఏపీలో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రాకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
What's Your Reaction?






