Big Breaking: రేషన్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Big Breaking: రేషన్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారు. కానీ అవి వెంటనే వచ్చేలా లేవు. అందువల్ల ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పాత రేషన్ కార్డుల లోనే కొత్త సభ్యుల పేర్లను చేర్చాలని నిర్ణయించింది. అంటే పిల్లలు, వేరే ఊర్ల నుంచి తిరిగి తెలంగాణకు వచ్చేసిన వారు, ఇప్పటివరకూ తమ పేర్లను చేర్చుకోని వారిని ఇప్పుడు చేర్చుతున్నారు. దీని వల్ల కొత్త రేషన్ కార్డు రాకపోయినా పాత రేషన్ కార్డులో పేరును చేర్పించుకొని లబ్ది పొందే వీలు.
తమ పేర్లను కూడా రేషన్ కార్డులలో చేర్చమని దాదాపు 6 లక్షల మంది అడుగుతూ ఉన్నారు. కానీ వారి ఆశలు తీరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర ఏళ్లవుతుంటే.. ఈ ప్రభుత్వం ఈ సమస్యను గమనించి, పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.కొత్త వారు తమ పేర్లను ఎలా చేర్పించాలి అనే డౌట్ ఉంటుంది. దానికి ప్రభుత్వం ఒక మార్గాన్ని చూపించింది. ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతోంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది తమ పేర్లను చేర్చాలి అని దరఖాస్తు చేసుకున్నారు.
ముందుగా వారి పేర్లను పరిశీలించి లబ్దిదారుల జాబితాలో చేర్చేందుకు ఒక్కొక్కటిగా ఆమోదిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో మాట్లాడుతున్న అధికారులు.. వారి పేర్లను పాత రేషన్ కార్డులలో చేర్చుతున్నారు. ఇలా ఈ ప్రక్రియ జరుగుతోంది. కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే, వారు కూడా చేసుకునే వీలు ఉంది. ప్రజాపాలన, మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
What's Your Reaction?






