తెలుగు రాష్ట్రాల చిన్న పిల్లల తల్లిదండ్రులకు బిగ్ అలెర్ట్... ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అప్డేట్
తెలుగు రాష్ట్రాల చిన్న పిల్లల తల్లిదండ్రులకు బిగ్ అలెర్ట్... ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అప్డేట్

దేశవ్యాప్తంగా పిల్లల ఆధార్ కార్డులను అప్‌డేట్ చెయ్యాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఆధార్ అప్‌డేట్ జరగబోతోంది. మే 5 నుంచి రెండు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. పిల్లల ఆధార్ కార్డులో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫొటో వంటి బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయాలి.
దీన్ని పిల్లలకు 5 ఏళ్లు వచ్చినప్పుడు, 15 ఏళ్లు వచ్చినప్పుడు చేయించాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా ఉచితం. బయోమెట్రిక్ అప్‌డేట్ అంటే ఏమిటి?: పిల్లల చేతులకు ఉండే 10 వేళ్ల ముద్రలు, పిల్లల కళ్ల ఐరిస్ స్కాన్, పిల్లల ముఖం ఫొటోని అప్‌డేట్ చెయ్యడాన్ని బయోమెట్రిక్ అప్‌డేట్ అంటారు. 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బయోమెట్రిక్ డేటా తీసుకోరు. కానీ 5 ఏళ్లు దాటిన తర్వాత మాత్రం తప్పనిసరిగా అప్‌డేట్ చేయించాలి.
అలాగే.. 15 ఏళ్లు వచ్చాక కూడా చేయించాలి. ఇలా ఎందుకంటే.. ఎదిగే పిల్లల్లో మార్పులు ఎక్కువగా ఉంటాయి. ముఖం కూడా చాలా మారుతుంది. 15 ఏళ్ల తర్వాత చేసిన అప్‌డేట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అయినప్పటికీ కావాలంటే ఎప్పుడైనా అప్‌డేట్ చేసుకోవచ్చు. అప్పుడు మాత్రం ఇలా చేసినందుకు రూ.100 తీసుకుంటారు.
What's Your Reaction?






