అతి భారీగా పెరగనున్న కాలేజీ ఫీజులు! ఎక్కడెక్కడ ఎంతంటే
అతి భారీగా పెరగనున్న కాలేజీ ఫీజులు! ఎక్కడెక్కడ ఎంతంటే

తెలంగాణ: హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు పెరగనున్నాయా? ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వానికి డిమాండ్ చేసినట్లు తెలుస్తున్నాయి.
ఇంతకీ ఈ డిమాండ్ ప్రకారం ఏయే కాలేజీలో ఎంత ఫీజులు పెరగనున్నాయి.? హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్నా ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజును 100 శాతం వరకు పెంచాలని కోరుతూ డిమాండ్ చేశాయి.
తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (TAFRC) కొన్ని ప్రముఖ కాలేజీల ఫీజును ఇలా పెంచాలని సూచించింది.
వీటిలో సీబీఐటీ రూ. 1.65 లక్షల నుంచి రూ.2.45 లక్షలకు, ఎమ్‌జీఐటీ రూ.1.60 లక్షల నుంచి రూ.2.45 లక్షలకు, గీతాంజలి రూ.1.20 లక్షల నుంచి రూ.1.55 లక్షలకు, గోకరాజు రంగా రాజు: రూ.1.30 లక్షల నుంచి రూ.1.80 లక్షలకు అలాగే వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి రూ.1.35 లక్షల నుంచి రూ.2.20 లక్షలకు, వాసవి ఇంజినీరింగ్ కాలేజీ: రూ.1.40 లక్షల నుంచి రూ.2.15 లక్షలకు పెంచాలని అనుకుంటునట్లు సమాచారం.
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజు పెంపుపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. దీనికి కారణం రేవంత్ రెడ్డి విద్యా శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న విషయం తెలిసిందే. మరి రేవంత్ రెడ్డి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
What's Your Reaction?






