దారుణం రాత్రంతా తుప్పల్లో మహిళా..! అపస్మారక స్థితిలో
దారుణం రాత్రంతా తుప్పల్లో మహిళా..! అపస్మారక స్థితిలో

తూ" గోదావరి జిల్లా:మే 14 రాత్రంతా చీకటి అంధకారం, ఉదయం మండే ఎండ విష కీటకాలు తిరిగే తుప్పల్లో ఓమహిళ 16 గంటలకు పైగా ఆ చేతన స్థితిలో గడిపింది.
ఆ మార్గంలో వెళ్లేవారు కొందరు చూడడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తుర్పుగోదావరి జిల్లా అల్లవంర మండలంలోని ఓ మహిళపై హత్యాయత్నా నికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో అల్లవరం సడక్ రోడ్డు సత్తెమ్మతల్లి గుడి సమీపంలో తుప్పల్లో ఓ మహిళ అపస్మారక స్థితిలో తలపై గాయంతో పడి ఉండటం స్థానికులు గమనించారు.
112 నంబరుకు సమాచా రం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మండలం లోని ఓ గ్రామానికి చెందిన మహిళగా(30)గా గుర్తించారు. గోసంగివారి పేటకు చెందిన ఓ వ్యక్తి సోమవారం రాత్రి తనను తీసుకువెళ్లి దాడి చేసినట్లు ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చిన తర్వాత చెప్పినట్లు సమాచారం. అత్యాచారం జరిగిందా? అనే విషయం వైద్య పరీక్షల్లో తేలనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
What's Your Reaction?






