ఉచిత సిలిండర్ల పథకంలో కీలక మార్పులు! మీ ఖాతాలో..
ఉచిత సిలిండర్ల పథకంలో కీలక మార్పులు! మీ ఖాతాలో..

అమరావతి: రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు - పొలిట్‌బ్యూరో సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చ ఉచిత సిలిండర్ల పథకం అమలులో కొన్ని మార్పులు చేసి లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే నగదు జమ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది.
జూన్ 12న వితంతు, ఒంటరి మహిళలకు కొత్తగా లక్షకు పైగా పింఛన్లు ఇవ్వాలని తీర్మానించింది. సంక్షేమ పథకాల అమలుకు త్వరలోనే క్యాలెండర్ విడుదల చేయాలని పొలిట్ బ్యూరో సభ్యులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మూడు గంటలపాటు జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో మొత్తం 12 అంశాలపై చర్చించారు. పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయించారు.
రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయాలని తీర్మానించారు. దీపం పథకానికి సంబంధించి మూడు సిలిండర్ల నగదుని లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే జమ చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు పార్టీ కార్యకర్తలు చనిపోతే బీమా మొత్తాన్ని వీలైనంత త్వరగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని పొలిట్‌బ్యూరోలో నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లో అర్హత ఉన్న 50 వేల 235 మందికి సీఎం సహాయ నిధి నుంచి రూ.349 కోట్లు ఆర్థికసాయం అందజేశామని తెలిపారు.
11 మాసాల్లో రాష్ట్రానికి 8.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు హామీ అమలుకి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏ పరిశ్రమలో, ఏ ఊరిలో, ఏ జిల్లాలో ఎంత మందికి ఉద్యోగాలిచ్చామన్న స్పష్టమైన సమాచారం ప్రతి ఒక్కరికీ తెలిసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
What's Your Reaction?






