Flash News: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం 'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం!
Flash News: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం 'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం!

AP CM చంద్రబాబు ఈ పథకం అమలు పైన స్పష్టత ఇచ్చారు. కాగా, ఇకే విడతలోనే అమలు చేస్తారా...
రెండు విడతలుగా చెల్లిస్తారా అనేది చర్చగా మారింది. ఇక.. దాదాపుగా ఈ పథకం అమలులో నిబంధనలు ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకే విడతలో రూ 15 వేలు చెల్లిస్తారా.. రెండు విడతలుగా రూ 7500 చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్దిదారుల సంఖ్య
కావాల్సిన నిధుల పైన ఒక అంచనాకు వచ్చారు. తాజాగా చంద్రబాబు కూటమి నేతలతో టెలి కాన్ఫిరెన్స్ లో తల్లికి వందనం పాఠశాలల ప్రారంభానికి ముందే అమలు చేస్తామని స్పష్టత ఇచ్చారు. 2025- 26 బడ్జెట్‌లో రూ. 9407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేసారు. 2024-25 విద్యా సంవత్స రంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాధమికం గా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం.
నిబంధనలు ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాల పైన అధ్యయనం కొనసాగుతోంది. పథకం అమల్లో భాగంగా విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. గతంలో వైసీపీ ప్రభు త్వం నిర్దేశించిన మార్గదర్శకాల ను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపు దారులు.. తెల్ల రేషన్ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు.
ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియో గం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక, కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
What's Your Reaction?






