Healthcare: మన శరీరంలో ఇటువంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త పడండి....
Healthcare: మన శరీరంలో ఇటువంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త పడండి....

మన శరీరంలో చాల సందర్భాల్లో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం వాటి వల్ల తీవ్రమైన నొప్పులు, రావటం జరుగుతూ ఉంటాయి. ఈ రాళ్లు శరీరంలో మరెన్నో సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది.
ఆ స్టార్టింగ్ దశ లక్షణాలను ముందు గానే గుర్తించడం ద్వారా సమస్యను నివారించవచ్చు. కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. కిడ్నీలు శరీరంలో అవసరం లేని పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అందుకని కిడ్నీల ఆరోగ్యం బాగుండటం చాలా అవసరం. అయితే కొందరిలో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే సమస్య వస్తుంది.
ఇది చాలా మందిని ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్య. అయితే ఈ సమస్య మూడో దశకు వెళ్లకముందే కొన్ని ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి నడుము వద్ద తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇది సాధారణ నొప్పిలా కాకుండా పక్కటెముకల కింద మొదలై పొత్తి కొడుపు నుంచి తొడల్లోకి అక్కడి నుంచి కాళ్లలోకి వ్యాపించవచ్చు. ఈ నొప్పి ఎడమవైపు లేదా కుడివైపు ఎక్కువగా ఉంటూ రోజంతా ఇబ్బందికరంగా ఉంటుంది. కిడ్నీ రాళ్ల వల్ల తేడాగా కనిపించే లక్షణాల్లో ఒకటి తరచూ యూరిన్ పాస్ చేయాలనే అనుకుంటాం.
కానీ సరిగ్గా వెళ్లలేకపోవడం వల్ల మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. యూరిన్ పాస్ చేసే సమయంలో నొప్పి ఏర్పడటం సహజమే. ఇది మూత్రనాళాలపై రాళ్లు ఒత్తిడి చేయడం వల్ల కలుగుతుంది. ఇది సరిగ్గా పట్టించుకోకపోతే రాళ్లు కిడ్నీలో ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తాయి. దీంతో మూత్రనాళాల్లో ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడి, బ్యాక్టీరియాల వృద్ధి పెరిగి శరీరమంతా దుష్ప్రభావం చూపుతుంది. ఇది మూత్రం రూపంలో బయటకు వెళ్లకపోవడం వల్ల కలిగే తీవ్ర పరిణామాల్లో ఒకటి. ఇది క్రమంగా కిడ్నీ పనితీరును ప్రభావితం చేస్తుంది.
రాళ్ల కారణంగా శరీరంలో రక్తపోటు పెరగవచ్చు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సమస్యను త్వరగా గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా అవాంఛనీయ పరిణామాలను నివారించవచ్చు. కాబట్టి ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి.
What's Your Reaction?






