ఏసీబీకి పట్టుబడ్డ డీఎస్పీ, ఎస్ఐ! భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్
ఏసీబీకి పట్టుబడ్డ డీఎస్పీ, ఎస్ఐ! భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్

Telangana:సూర్యాపేట: సూర్యాపేట డీఎస్పీ కార్యాలయం పై ఏసీబీ దాడులు ఓ మెడికల్ కేసు విషయంలో 25 లక్షలు డిమాండ్ చేసిన సూర్యాపేట సీఐ వీర రాఘవులు, డీఎస్పీ పార్థసారథి. డీఎస్పిని, సీఐనీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు.
ఓ స్కాన్ సెంటర్ నిర్వాహకుడు అర్హత లేకుండానే స్కాన్ చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు పెద్ద ఎత్తున వెలువడ్డాయి. ఈ తరుణంలోనే ఐఎంఏ డాక్టర్స్ డీఎస్పీ పార్థసారథికి, టౌన్ సీఐ రాఘవులకి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఈ మధ్యకాలంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయం పై విచారణ చేపట్టిన సూర్యాపేట టౌన్ సీఐ వీర రాఘవులు కేసు విషయంపై డీఎస్పీ దగ్గర సెటిల్మెంట్లు చేసుకోండి అంటూ పంపించాడని ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు.
సోమవారం సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో రెండున్నర గంటల పాటు విచారణ చేసిన ఏసీబీ ఆధికారులు సూర్యాపేట టౌన్, సూర్యాపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఫిర్యాదుదారుడు నుండి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 16 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదు దారుడు ఇచ్చిన పిటిషన్ మేరకు విచారణ చేసి సూర్యాపేట పట్టణ సీఐ రాఘవులు, డీఎస్పీ పార్థసారథి పై కేసు నమోదు చేసి కస్టడీలో పెట్టామని నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు.
What's Your Reaction?






