Alert Iphone Users: ఐఫోన్ వాడుతున్నారా తస్మాత్ జాగ్రత్త! మీ డేటా హాక్ అవ్వవచ్చు

Alert Iphone Users: ఐఫోన్ వాడుతున్నారా తస్మాత్ జాగ్రత్త! మీ డేటా హాక్ అవ్వవచ్చు

May 13, 2025 - 21:27
May 13, 2025 - 21:46
 0  59
Alert Iphone Users: ఐఫోన్ వాడుతున్నారా తస్మాత్ జాగ్రత్త! మీ డేటా హాక్ అవ్వవచ్చు
Alert Iphone Users: ఐఫోన్ వాడుతున్నారా తస్మాత్ జాగ్రత్త! మీ డేటా హాక్ అవ్వవచ్చు

మీరు ఐఫోన్ వాడుతున్నారా? కానీ జాగ్రత్తగా ఉండండి..! ఎందుకంటే మీ వ్యక్తిగత డేటా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.తాజా సమాచారం ప్రకారం, భారత ప్రభుత్వ CERT-In బృందం Apple iPhone మరియు iPad వినియోగదారులకు అధిక తీవ్రత హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే iOS మరియు iPadOS లలో కొన్ని లోపాలు మరియు హానికరమైన అప్లికేషన్లు ఉన్నాయి.

దీని కారణంగా, సైబర్ నేరస్థులు ఆ పరికరాల్లోని డేటాను హ్యాక్ చేసే అవకాశం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం పేర్కొంది.ఐఫోన్ XS మరియు ఆ తర్వాతి మోడళ్లలో, అలాగే ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ మరియు iOS 18.3 లేదా పాత వెర్షన్‌ల వంటి వివిధ ఐప్యాడ్ మోడళ్లలో లోపాలు ఉన్నాయని CERT-In వెల్లడించింది.

అందువల్ల, మీ డేటా హ్యాక్ కాకుండా నిరోధించడానికి వినియోగదారులు తమ ఐఫోన్‌లను తాజా వెర్షన్ (iOS 18.5)కి అప్‌డేట్ చేయాలని సిఫార్సు చేయబడింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News