13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ! అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంలో
13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ!

13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు. అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ విషయంలో నిబంధనలు అతిక్రమించారని జిల్లాలోని 13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
గతంలో 20 ఏళ్ల కాలపరిమితితో అసైన్డ్ భూముల పై రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణలు చేసిన విషయం తెలిసిందే. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు రావడంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం విచారించింది. అప్పట్లో ఆయా మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
అప్పట్లో తహసీల్దార్లుగా పనిచేసిన అనూరాధ (మైదుకూరు), వి.గంగయ్య (పోరుమామిళ్ల) మధుసూదన్ రెడ్డి (బద్వేల్), విజయకుమారి (వీఎన్ఏల్లె), లక్ష్మీనారాయణ (లింగాల), మహబూబ్ బాషా (సింహాద్రిపురం), గుర్రప్ప (జమ్మ లమడుగు), ఉదయభాస్కర్ రాజు (పెండ్లిమర్రి), సువర్ణ (బి.మఠం), సరస్వతి (కమలాపురం) రామచంద్రుడు (కాశినాయన), వెంకటసుబ్బయ్య (వేముల), శంకర్రావు (వల్లూరు) లు షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ప్రధానంగా మైదుకూరు, లింగాల, బి.మఠం, జమ్మలమడుగు మండలాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలిసింది.
What's Your Reaction?






