దర్శి మండలం లో MSME పార్కులు ప్రారంభించిన టీడీపీ ఇంచార్జి Dr.గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్
దర్శి మండలం లో MSME పార్కులు ప్రారంభం చేసినా దర్శి టీడీపీ ఇంచార్జి Dr.గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్

Darsi(RMB News): Dr.Gottipati Lakshmi Lalith Sagar: Darsi మండలం, చందలూరు గ్రామంలో శుక్రవారం ఎమ్మెస్ ఎంఈ పార్క్ దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, ఏపీఐఐసీ అధికారులు, దర్శి ఎమ్మార్వో శ్రవణ్ నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పార్కు ఉపయోగపడుతుందన్నారు. చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు అవసరమైన అన్ని వస్తువులతో ఈ పార్కులో ప్లాట్ ల కేటాయింపు చేపట్టడం జరుగుతుందన్నారు. దీనిద్వారా వందలాదిమంది పారిశ్రామిక వేత్తలు అవడంతో పాటు వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
What's Your Reaction?






