విషాద ఘటన: ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన సరదా..!
విషాద ఘటన: ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన సరదా..!

కడప జిల్లా: మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
సెలవులపై అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మల్లేపల్లి గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లారు. సాయంత్రం అయినా బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. గ్రామంలో వెతుకుతుండగా పిల్లల బట్టలు, చెప్పులు చెరువు ఒడ్డున కనిపించాయి.
దీంతో గ్రామస్తులంతా చెరువు వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లతో చెరువులో పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు పిల్లల ఆనవాళ్ళు తెలియలేదు. రాత్రి అయినా పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజఈతగాళ్లు ఆపకుండా వెతకడంతో పిల్లలంతా ఒకే చోట విగత జీవులై కనిపించారు.
వీరంతా అక్క, చెల్లెలు, అన్న పిల్లలుగా గుర్తించారు. చనిపోయిన బాలురంతా 15 సంవత్సరాలలోపు వారే కావడంతో విశేషం. ఇందులో ఆళ్ళగడ్డకు చెందిన చరణ్, పార్దు ఇద్దరూ అన్నదమ్ములు ఒకే తల్లి పిలలు. వీరిద్దరు చనిపోవడంతో ఆ కుటుంబం మరింత శోకసంద్రంలో మునిగిపోయింది.
What's Your Reaction?






