దూసుకొస్తున్న శక్తి తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దూసుకొస్తున్న శక్తి తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడింది. శక్తి తుపానుగా మారింది. ఈ శక్తి తుఫాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు తో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు నైరుతి రుతు పవనాలు కేరళ తీరం వైపుకు దూసుకొస్తున్నాయి.
మరో రెండు రోజుల్లో తీరాన్ని తాకనున్నాయి. ఫలితంగా ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్షసూచన జారీ చేసింది వాతావరణ శాఖ. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మే 26, 27 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నారు.
రాయలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై శక్తి తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం దాటి ఉత్తరం వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రెండు రోజుల్లో ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదవుతాయని అధికారులు ప్రకటించారు.
కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఏడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్, పొలాలు,బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి. -ఏపీ విపత్తుల సంస్థ
What's Your Reaction?






