భారత్- పాక్ యుద్ధ విరమణ: అధికారికంగా ప్రకటించిన ఇరుదేశాలు?
భారత్- పాక్ యుద్ధ విరమణ: అధికారికంగా ప్రకటించిన ఇరుదేశాలు?

హైదరాబాద్:మే 10 భారత్- పాకిస్తాన్ లు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈరోజు మధ్యాహ్నం భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని ట్రంప్ పేర్కొన్నారు.
భారత్, పాక్ దేశాలకు మధ్యవర్తి త్వం వహించామని.. సుదీర్ఘ చర్చల తర్వాత తక్షణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించా యని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ విరమణకు భారత్, పాక్ అంగీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు ట్రంప్. రెండు దేశాలు అంగీకరించాయన్న విషయాన్ని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి అధికారికంగా పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
What's Your Reaction?






