బంగాళాఖాతంలో భారీ తుఫాన్! తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్

బంగాళాఖాతంలో భారీ తుఫాన్! తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్

May 19, 2025 - 12:18
May 19, 2025 - 12:33
 1  49646
బంగాళాఖాతంలో భారీ తుఫాన్! తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్
బంగాళాఖాతంలో భారీ తుఫాన్! తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్

(బంగాళాఖాతంలో భారీ తుఫాన్! తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్) తెలుగు రాష్ట్రాలకు 7 రోజులు భారీ వర్షాలు. నైరుతీ రుతుపవనాలు జోరుమీదున్నాయి. నైరుతీ రుతుపవనాలు దూసుకువచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు నైరుతీ రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాతాలకు రానున్నాయి.

అలాగే శ్రీలంక కింద ప్రాంతం, మాల్దీవులు, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రం అంతటా నైరుతీ రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రానున్న 2,3 రోజుల్లో ఇవి మధ్య బంగాళాకాతంలోకి కూడా వస్తాయని IMD తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఉండటంతో మేఘాలు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తులో మొదలై 5.8కి.మీ వరకు విస్తరించి ఉన్నాయి. అలాగే మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది కోస్తాంధ్రకు దగ్గరలోనే ఉంది.

దీని వల్ల సముద్రమట్టం నుంచి 1.5కి.మీ ఎత్తులో మేఘాలు , గాలులు గుండ్రంగా తిరుగుతున్నాయి. ఈ ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తర్వాత తుపానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి ఆల్రెడి శక్తి అనే పేరును కూడా పెట్టారు. ఈ శక్తి తుపాన్ వచ్చే రెండు వారాలపాటూ ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News