తెలుగు రాష్ట్రాలపై శక్తి తుఫాన్! వారం రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలపై శక్తి తుఫాన్! వారం రోజులు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలపై శక్తి తుఫాన్! వారం రోజులు భారీ వర్షాలు. బంగాళాఖాతం లో అల్పపీడనం తీవ్ర శక్తి తుఫాన్ గా మారి తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుచి అతి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తాయి.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీని వల్ల దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తీరాన్ని తాకుతాయని IMD పేర్కొంది.
ఉపరితల ఆవర్తనాల శక్తి తుఫాన్ ప్రభావంతో రానున్న రోజుల్లో కోస్తా కర్ణాటక, కేరళ, మాహే, దక్షిణ ఒడిశా, కర్ణాటకలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అరుణాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురలలోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్, పొలాలు,బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి. -ఏపీ విపత్తుల సంస్థ
What's Your Reaction?






