ఏపీ: బంగాళాఖాతంలో అల్పపీడనం! పొంచి ఉన్న ముప్పు
ఏపీ: బంగాళాఖాతంలో అల్పపీడనం! పొంచి ఉన్న ముప్పు. బంగాళాఖాతంలో అల్పపీడనం శక్తి తుఫాన్ గా రూపాంతరం.

(ఏపీ: బంగాళాఖాతంలో అల్పపీడనం! పొంచి ఉన్న"శక్తి తుఫాన్"ముప్పు) బంగాళాఖాతంలో అల్పపీడనం శక్తి తుఫాన్ గా రూపాంతరం.
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర శక్తి తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.ఈ శక్తీ తుఫాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తుఫాను ఏర్పడే అవకాశం ఉంది.
మధ్య అక్షాంశాలలో గాలి దాదాపు 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం దాటి ఉత్తరం వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రెండు రోజుల్లో ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది.కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదవుతాయని అధికారులు ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఏడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై శక్తి తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
What's Your Reaction?






