ఏపీ: ప్రజలకు భారీ గుడ్ న్యూస్! చెప్పిన కూటమి ప్రభుత్వం
ఏపీ: ప్రజలకు భారీ గుడ్ న్యూస్! చెప్పిన కూటమి ప్రభుత్వం

రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికీ (Free Heath Insurance) ఆరోగ్య బీమాను అందించనుంది.
NTR వైద్య సేవా ట్రస్ట్ (ఆరోగ్యశ్రీ) సేవలను బీమా పద్ధతిలో అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఒక ముసాయిదాను తయారు చేసింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నారు.
ఏడాదికి రూ.2.5 లక్షల వరకు వైద్య సేవలను బీమా సంస్థ ద్వారా ఉచితంగా అందిస్తారు. రాష్ట్రంలో దాదాపు 1.43 కోట్ల పేద కుటుంబాలు ఉన్నాయి. అలాగే దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న 19-20 లక్షల కుటుంబాలకు కూడా ఈ బీమా పథకం వర్తిస్తుంది. వీరికి ఎలాంటి షరతులు ఉండవు.
ఏడాదికి రూ.2.5 లక్షల విలువైన వైద్య సేవలు ఉచితంగా బీమ సంస్థ ద్వారా అందిస్తారు. ఒకవేళ అంతకుమించి ఖర్చు దాటితే. రూ.25 లక్షల వరకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరిస్తుంది.
What's Your Reaction?






