మళ్ళీ దేశంలో కరోనా వైరస్! భారీగా పెరుగుతున్న కేసులు

మళ్ళీ దేశంలో కరోనా వైరస్! భారీగా పెరుగుతున్న కేసులు

May 20, 2025 - 19:39
May 20, 2025 - 20:07
 0  282
మళ్ళీ దేశంలో కరోనా వైరస్! భారీగా పెరుగుతున్న కేసులు
మళ్ళీ దేశంలో కరోనా వైరస్! భారీగా పెరుగుతున్న కేసులు

2025 లో కరోనా వైరస్ మనదేశం లో నమోదు.(Corona Virus) మళ్లీ తన విశ్వరూపం చూపిస్తూ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

హాంకాంగ్(Hong Kong), సింగపూర్‌(Singapore)లో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హాంకాంగ్‌లో ఒక్క May మొదటి వారంలోనే వేల సంఖ్యలో కరోనా కేసులు రికార్డు అవ్వగా వీరిలో నెలల వయసున్న చిన్నారులతో సహా చాలా మందికి వైరస్ సోకింది.

సింగపూర్‌లో ఈ వారంలోనే 14,200 కేసులు నమోదు కాగా గత కొన్ని నెలలతో పోలిస్తే ఇది భారీ సింగపూర్‌లో కేసులు. వేరియంట్‌లు గత వాటి కంటే తొందరగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. తీవ్రమైన అనారోగ్యం కలిగించే సామర్థ్యం తక్కువని నిపుణులు చెబుతున్నారు.

అయితే వ్యాక్సినేషన్ రేటు తగ్గడం, రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి కరోనా లక్షణాలు గతంతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. వాసన, రుచి కోల్పోవడం తగ్గి, జలుబు, సీజనల్ అలర్జీలా తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నప్పటీ 75 ఏళ్లు పైబడినవారు, రోగనిరోధక శక్తి తక్కువవారు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తీవ్ర ప్రమాదంలో పడనున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News