ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్! కీలక స్పీచ్
ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్! కీలక స్పీచ్

న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్! కీలక స్పీచ్2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగింది. వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుంది. మా ప్రభుత్వం రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.
ఇంత వరకు ఎప్పుడూ చూడనటువంటి విధ్వంసం గత ఐదేళ్లలో జరిగింది. గత ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది. వైసీపీ చేసిన విధ్వంసానికి ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ప్రజలు మాకు విజయం కట్టబెట్టారు. ఈ ఏడాదిలో రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఢిల్లీకి వచ్చిన ప్రతీసారి ఏడుగురు కేంద్రమంత్రులను కలుస్తున్నా. మా ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చింది.
ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని ప్రహ్లాద్ జోషిని కోరాం. గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణానికి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించారు. సూర్యఘర్ కింద 35 లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని ఆకాంక్షించాం.
సూర్యఘర్ కింద ప్రతి నియోజకవర్గంలో 10 వేల కుటుంబాలకు విద్యుత్ ఇస్తాం. సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. కుసుమ్ కింద 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అనుమతి ఇచ్చింది. రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారబోతుంది. గ్రీన్ ఎనర్జీ ద్వారా 24 గంటలూ విద్యుత్ సరఫరా చేసేందుకు వీలవుతుంది.
ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేసిన రాజ్‌నాథ్‌సింగ్‌కు అభినందనలు తెలిపాను. జగ్గయ్యపేట-డోలకొండ క్లస్టర్‌లో 6 వేల ఎకరాలు అందుబాటులో ఉంది. జగ్గయ్యపేట-డోలకొండ క్లస్టర్‌ను మిస్సెల్ అండ్ అమ్యూనేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరాం. లేపాక్షి-మడకశిర క్లస్టర్‌లో మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎలక్ట్రానికి తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరాం.
విశాఖ-అనకాపల్లి క్లస్టర్‌లో నేవల్ ఎక్స్‌పరిమెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరాం. కర్నూలు-ఓర్వకల్లు క్లస్టర్‌లో మిలిటరీ డ్రోన్లు, రొబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెట్స్ తయారీ చేయాలని కోరాం.
తిరుపతి ఐఐటీలో డీఆర్డీవో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పెట్టాలని కోరాం. మా ప్రతిపాదనలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో సైనిక కంటోన్మెంట్ పెట్టాలని కోరా సానుకూలంగా స్పందించారు. జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో పోలవరంపై చర్చించాను. పోలవరాన్ని 2027లోపు పూర్తి చేసేలా ప్రణాళిక ఉంది. ఎంత త్వరగా వీలైతే. అంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం.
పోలవరం నాణ్యతలో రాజీపడం. రూ.400 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్‌ను గత ప్రభుత్వం దెబ్బతీసింది. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల మళ్లీ రూ.980 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నాం. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చవుతుంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలను దారి మళ్లించవచ్చు.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. సముద్రంలో కలిసే నీళ్లను పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తరలిస్తాం. కేంద్రం అనుమతి ఇవ్వగానే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ప్రారంభిస్తాం.
శాంతిభద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్షించారు. శాంతిభద్రతల కోసం కేంద్రహోంమంత్రి కొన్ని సూచనలు ఇచ్చారు. అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని కోరాం. సానుకూలంగా స్పందించారు. ఆర్డీటీ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లాం. పూర్వోదయ పథకం మరికొన్ని నిధులు ఇవ్వాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరాను.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు ఆర్థికంగా సహకరించాలని నిర్మలా సీతారామన్‌ను కోరాం. మా ప్రతిపాదనలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. సంక్షేమాన్ని కొనసాగిస్తూనే. అభివృద్ధి చేస్తున్నాం. సంపద సృష్టించాలంటే ప్రభుత్వం కొత్త విధానాలు తీసుకురావాలి. కేంద్రం నుంచి ఆర్థికసాయమే కాదు అనుకూలమైన ప్రతిపాదనలు కావాలి. సీఎం చంద్రబాబు
What's Your Reaction?






