హీరో విశాల్‌కు అస్వస్థత.. వేదికపై కుప్పకూలిన విశాల్! వణుకుతున్న చేతులతో
హీరో విశాల్‌కు అస్వస్థత.. వేదికపై కుప్పకూలిన విశాల్! వణుకుతున్న చేతులతో

ట్రాన్స్‌జెండర్లు తమదైన స్టైల్లో విశాల్‌ను ఆశీర్వదించారు. కలిసి ఫొటోలు కూడా దిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఉన్నట్టుండి స్ప్రహ తప్పిపడిపోయారు.హీరో విశాల్ ఆదివారం తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన మిస్ విల్లూపురం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కంటెస్ట్‌కు ముఖ్య అతిధిగా వెళ్లారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పొన్ముది కూడా వచ్చారు. విశాల్ స్టేజిపై ఉండగా.. కొంత మంది ట్రాన్స్‌జెండర్లు ఎంతో ఆప్యాయంగా ఆయన్ను పలకరించారు. తమదైన స్టైల్లో విశాల్‌ను ఆశీర్వదించారు. కలిసి ఫొటోలు కూడా దిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు.
கூட்டத்தில் மயங்கி விழுந்த விஷால்... விழுப்புரத்தில் பரபரப்பு#vishal | #thanthicinema | #villupuram pic.twitter.com/DgrXSOv9FU — Thanthi TV (@ThanthiTV) May 11, 2025
స్టేజిపై స్ప్రహ తప్పిపడిపోయారు. ఆయన ఒక్కసారిగా కుప్పకూలటంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వెంటనే స్పందించి ఆయన్ని పైకి లేపారు. ఆ వెంటనే చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్న దానిపై డాక్టర్లనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
విశాల్ అస్వస్థతపై ఆయన మేనేజర్ హరి మాట్లాడుతూ.. ‘ భోజనం చేయకపోవటం వల్ల ఆయన అస్వస్థతకు గురైఉండొచ్చు’ అని చెప్పారు. ఇక, విశాల్ అనారోగ్యంపై అభిమానులతో పాటు ఆయన కుటుంబసభ్యులు, మిత్రులు ఆందోళన చెందుతున్నారు.
What's Your Reaction?






