70 లక్షలు లంచం తీసుకుంటూ CBI కి చిక్కిన ఐటీ కమిషనర్ అరెస్ట్
70 లక్షలు లంచం తీసుకుంటూ CBI కి చిక్కిన ఐటీ కమిషనర్ అరెస్ట్

బిగ్ బ్రేకింగ్ న్యూస్: 70 లక్షలు లంచం తీసుకుంటూ CBI కి చికిన IRS అధికారి.
హైదరబాద్ లో ఆదాయపు పనుశాఖ కమిషనర్ జీవన్ లాల్ ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు డీల్ చేసుకున్నాడు. మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటూడగా అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. పలు ప్రాంతాలలో సోదాలు చేసి కీలక పాత్రలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు ఆయనతో పాటు మరో 14 మందిపై సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. సదరు కమిషనర్ తన వద్ద ఫైళ్లను పెండింగ్‌లో పెట్టుకొని వాటికి క్లియరెన్స్ ఇవ్వడానికి లంచం తీసుకుంటున్నట్లు సీబీఐ గుర్తించింది. లంచం తీసుకొని పలువురి అక్రమంగా పనులు చేసి పెట్టినట్లు తేల్చింది.
ఈ క్రమంలో సీబీఐ వల పన్ని నిందితుడిని పట్టుకుంది. ఓ వ్యక్తి నుంచి రూ.70 లక్షల లంచం తీసుకుంటుండగా శనివారం సీబీఐ అధికారులు నిందితుడు పంపిన మధ్యవర్తిని పట్టుకున్నారు. కమిషనర్, మధ్యవర్తితో పాటు కమిషనర్ సహచరులు సహా 15 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రధాన నిందితుడైన కమిషనర్‌ను ముంబయిలో అరెస్ట్ చేసింది.
ముంబయి, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్నం, ఢిల్లీలోని 18 ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు చేపట్టింది. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచామన్నారు.
What's Your Reaction?






