ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ ఏఈ! తెలుగు రాష్ట్రాల్లో లంచావతారాలు
ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ ఏఈ! తెలుగు రాష్ట్రాల్లో లంచావతారాలు

ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ ఏఈ! తెలుగు రాష్ట్రాల్లో లంచావతారాలు. సినిమా స్టైల్లో 10 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు సూర్యాపేట జిల్లాలో మిషన్ భగీరథ డీఈఈగా పని చేస్తూ, కాంట్రాక్టర్ వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇస్లావత్ వినోద్.
నారాయణపేట జిల్లా మక్తల్ లో ఏఈగా పని చేసి, గత ఏడాది బదిలీపై డీఈఈగా సూర్యాపేటకు వచ్చిన ఇస్లావత్ వినోద్ మక్తల్ లో పనిచేసినప్పుడు ఎంబీ (మెజర్మెంట్ బుక్) రాసేందుకు కాంట్రాక్టర్ వద్ద రూ.20 లక్షలు లంచం డిమాండ్ చేసిన వినోద్.
సూర్యాపేటకు బదిలీ అయినప్పటికీ ఎంబీని తన వద్దే పెట్టుకుని, లంచం ఇస్తేనే పని చేస్తానని తేల్చి చెప్పిన వినోద్ దిక్కుతోచని స్థితిలో ఏసీబీని ఆశ్రయించగా, అధికారుల సూచన మేరకు లంచం ఇస్తానని ఒప్పుకున్న కాంట్రాక్టర్ సూర్యాపేటలోని కోదాడ బైపాస్ రోడ్డులో ఉన్న ఫుడ్ కోర్టు వద్ద డబ్బులు ఇస్తానని చెప్పడంతో, కారులో వచ్చి కాంట్రాక్టర్ ను ఎక్కించుకొని తీసుకెళ్లిన వినోద్ ఏసీబీ అధికారులను గమనించి కాంట్రాక్టర్ ను కారు నుండి దింపేసి డబ్బుతో పారిపోయిన వినోద్ దాదాపు 10 కిలోమీటర్లు వెంబడించి, వినోద్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు
What's Your Reaction?






