యూట్యూబర్ ముసుగులో జ్యోతి మల్హోత్రా అరాచకాలు! పాక్ గూఢచారిగా
యూట్యూబర్ ముసుగులో జ్యోతి మల్హోత్రా అరాచకాలు! పాక్ గూఢచారిగా

(యూట్యూబర్ ముసుగులో "జ్యోతి మల్హోత్రా"అరాచకాలు! పాక్ గూఢచారిగా) ఇండియాలోనే ఉంటూ మన శత్రుదేశమైన పాకిస్థాన్‌కు పలువురు కీలక సమాచారం చేరవేశారు.
ఈ క్రమంలోనే తాజాగా పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై హర్యానాకు చెందిన మహిళా యూట్యూబర్ (YouTuber leaks to Pakistan), యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సహా ఆరుగురు భారతీయ పౌరులను అరెస్టు చేశారు. జ్యోతి 'ట్రావెల్ విత్ జో' అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది.
అయితే జ్యోతి 2023లో పాకిస్థాన్‌కు వెళ్లి, అక్కడ పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో పరిచయం ఏర్పరచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. డానిష్ ఆమెను పాకిస్థాన్ నిఘా ఏజెంట్లకు పరిచయం చేశాడు. ఆ క్రమంలో ఆమె ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా వారితో సంబంధాలు కొనసాగించినట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో పంజాబ్‌లోని మాలెర్‌కోట్లాకు చెందిన ఇద్దరు వితంతువులు సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. భారత సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రదేశాల గురించి సమాచారాన్ని పాకిస్థాన్ పంపినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి.పాకిస్థాన్ ఏజెంట్లు వీరికి డబ్బు ఆశ చూపించి వలలో వేసుకున్నారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి.
కొన్ని సందర్భాలలో పెళ్లి కూడా చేసుకుంటామని తప్పుడు వాగ్దానాలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులందరినీ విచారిస్తున్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.
What's Your Reaction?






