Terrorist: సంగారెడ్డిలో పాక్ టెర్రరిస్ట్? అరెస్ట్ చేసిన పోలీసులు
Terrorist: సంగారెడ్డిలో పాక్ టెర్రరిస్ట్? అరెస్ట్ చేసిన పోలీసులు

(Terrorist: సంగారెడ్డిలో పాక్ టెర్రరిస్ట్? అరెస్ట్ చేసిన పోలీసులు) సంగారెడ్డి నుండి పాకిస్థాన్ కు పకడ్బందీ సమాచారాలు ఇస్తున్న ఉగ్రవాది వీడే. అధికారులు వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాదులను, వారి సానుభూతిపరులను కూడా గుర్తించి అరెస్టు చేస్తున్నారు.
ఇక్కడే నివసిస్తూ ఉగ్రవాదులకు సమాచారం లీక్ చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయనే తాజా వార్తలు కలకలం రేపుతున్నాయి. వీడి పని కేవలం ఇక్కడున్న యువకులను ఉగ్రవాదులుగా తయారు చేయడమే.. NIA దగ్గర కీలక సమాచారం.
కేంద్ర ఇంటలిజెన్సీ బలగాల హెచ్చరికతో అప్రమత్తమైన అస్సాం పోలీసులు వీడిని కొండాపూర్,గొల్లపల్లిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది.. సామాన్య కూలీ మేస్త్రిగా జీవనం సాగిస్తున్నట్లు నటన.. ఉగ్రవాదులకు సహకరిస్తున్న సంగారెడ్డి (D) కొండాపూర్ (M) గొల్లపల్లికి చెందిన మోఫిజుల్ ఇస్లాం(19)ను అస్సోం పోలీసులు అరెస్ట్ చేశారు. మేస్త్రిగా పనిచేస్తున్న ఇస్లాం నకిలీ సిమ్ కార్డులను సేకరించి విక్రయిస్తున్నట్లు సమాచారం.
#OperationGhostSIM
Assam police has arrested 7 people for helping people from Pakistan to use WhatsApp from Indian numbers by sharing OTPs.
7 arrested, 948 SIMs seized.
These SIMs were being used for cyber crimes and anti-national operations. pic.twitter.com/crLN5LMmpO — Incognito (@Incognito_qfs) May 18, 2025
దేశానికి చెందిన సిమ్ కార్డులతో OTPలు చెప్పి పాకిస్థాన్లో వాట్సప్ అకౌంట్లు క్రియేట్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదానికి జిల్లాకు లింకులు ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
What's Your Reaction?






